మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో అర్ ఓ లు, ఏ అర్ ఓ ల పాత్ర కీలకం 

-మున్సిపల్ ఎన్నికలను పగడ్బందీగా విజయవంతంగా నిర్వహించాలి…..
-పోలింగ్ కేంద్రాలకు కౌంటింగ్ మెటీరియల్ జాగ్రత్తగా పంపాలి….
-మున్సిపల్ కమిషనర్ డి. కె. బాలాజీ

Date:23/02/2021

కర్నూలు  ముచ్చట్లు:

మున్సిపల్ ఎన్నికలను పగడ్బందీగా విజయవంతంగా నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ డీకే. బాలాజీ పేర్కొన్నారు. మంగళవారం కర్నూలు నగరపాలక సంస్థ సమావేశ భవనంలో మున్సిపల్ ఎన్నికలపై ఆర్ ఓ లు, ఏ ఆర్ ఓ లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ డీకే. బాలాజీ మాట్లాడుతూ రిటర్నింగ్ అధికారులు అందరూ మునిసిపల్ ఎన్నికలను పగడ్బందీగా, నిష్పక్షపాతంగా, విజయవంతంగా నిర్వహించడానికి ఒక కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్నారు. ఈ ఎన్నికలలో విత్ డ్రాల్స్ చాలా జాగ్రత్తగా చూడాలన్నారు. ఎన్నికల ఎక్స్పెండిచర్ కు సంబంధించి ప్రత్యేక రిజిస్టరు ఏర్పాటు చేయాలన్నారు.
లింగ్ మెటీరియల్స్ అన్ని ఒక బాక్స్ లో వేసి చాలా జాగ్రత్తగా పోలింగ్ కేంద్రాలకు పంపాలన్నారు. పోలింగ్ మెటీరియల్ ఏ ఒక్కటి లేకపోయినా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఇది ప్రతి ఒక్కరు జాగ్రత్తగా గమనించాలన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రతి ఒక్కటి వీడియోగ్రఫీ చేయించాలన్నారు.

 

 

పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్, పక్కాగా నిర్వహించాలన్నారు.
ఈ ఎన్నికలను ప్రతి ఒక్కరూ ఛాలెంజ్గా తీసుకొని గ్రామ పంచాయతీ ఎన్నికల తరహాలో ప్రశాంతంగా నిర్వహించడానికి అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు.

2 వ తేదీ ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు
నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు.3 వ తేదీ అభ్యర్థుల విత్ ద్ డ్రాల్స్,
3 వ తేదీ సాయంత్రం 3.00 గంటల తర్వాత ఫైనల్ అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుందన్నారు.
10న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్,
13 వ తేదీ ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రీ పోలింగ్,
14 వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు, ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అభ్యర్థుల విత్ డాల్స్, ఎన్నికల ఎక్స్పెండిచర్, నామినేషన్ల ఫాన్స్ నింపే విధానం, పోస్టల్ బ్యాలెట్లు, కౌంటింగ్ నిర్వహించే విధానం, మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్, వంటి సూచనలు సలహాలను ఆర్ వో లు ఏ ఆర్ వో లకు వివరించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికల విధులు నిర్వహించాలన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ రామలింగేశ్వ ర్, అర్ ఓ లు, ఏ ఆర్ ఓ లు తదితరులు పాల్గొన్నారు.

వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Tags: The role of AROs and AROs is crucial in the conduct of municipal elections

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *