Natyam ad

నేరాల నియంత్రణలో బ్లూ కోల్ట్స్, పెట్రో కార్ సిబ్బంది పాత్ర కీలకం

-నిర్ణిత సమయంలో డయల్-100 కాల్స్ కి త్వరితగతిన స్పందించి సమస్యను పరిష్కరించాలి
-రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి

రామగుండం ముచ్చట్లు:

Post Midle

నేరాల నియంత్రణలో, ప్రజలకు మొదటగా అందుబాటులో ఉండే బ్లూ కోల్ట్స్, పెట్రో కార్ సిబ్బంది పాత్ర కీలకం ఆని రామగుండం పోలీస్ కమిషనర్  చంద్రశేఖర్ రెడ్డి (ఐజీ) ఆన్నారు.బుధవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలోని బ్లూకోల్ట్స్, పెట్రోకార్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి (ఐజీ) హాజరై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీపీ గ మాట్లాడుతూ ప్రాపర్టీ సంబంధిత నేరాల నియంత్రణలో బ్లూకోల్ట్స్, పెట్రోకార్స్ అధికారుల పాత్ర కీలకం అని, డయల్ 100 కాల్ వచ్చినప్పుడు అత్యవసర సమయంలో బాదితులకి వేగవంతమైన స్పందన తప్పక ఇవ్వాలని తక్కువ సమయంలోనే సంఘటన స్థలానికి చేరుకుని సమస్యను పరిష్కరించాలని,  సేవలు అందించాలని బ్లూకోల్ట్స్, పెట్రో కార్  సిబ్బంది, ప్రజల పట్ల బాధ్యతగా మెలగాలని, అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ, అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని సూచించారు.

 

 

ఫ్రెండ్లీ పోలీసింగ్, విసిబుల్ పోలీసింగ్ లో భాగంగా అత్యవర సేవలు అయిన రోడ్డు ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, పట్టణాల, గ్రామాలలో జరిగే అవాంఛనీయ సంఘటనలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు మొదలైన వాటికి సంబందించిన డయల్ 100 కాల్ ద్వారా సమాచారం అందిన వెంటనే ఆ ప్రాంతంలో అందుబాటులో ఉన్న బ్లూ కోల్ట్ సిబ్బంది  లేదా పెట్రోల్ వెహికల్స్ సిబ్బంది తక్షణమే స్పందించి తగు చర్యలు,  డ్యూటీ లో భాగంగా ఆన్లైన్ లో అప్లోడ్ చేయవలసిన అంశాల గురించి శిక్షణ ఇవ్వడం జరిగిందని సీపీ తెలిపారు. బ్లూ కోల్ట్ సిబ్బంది లేదా పెట్రోల్ వెహికల్స్ సిబ్బంది తమ విధులలో భాగంగా పాయింట్ బుక్స్, ఎం.ఓ క్రిమినల్స్ ను చెక్ చేయడం గురించి తగు సూచనలు చేశారు. ప్రజలలో భద్రతభావం పెంపొందిస్తూ నేరస్థులకు నేరం చేస్తే పట్టుబడుతామనే భయం కల్గించే లక్ష్యంతో బ్లూకోల్ట్స్ సిబ్బంది విభాగంలోని అధికారులు తమ ఏరియా పై సమగ్ర సమాచారం కలిగి ఉండి  ఆ ప్రాంత ప్రజల రక్షణకు భరోసా కల్పించాలని అన్నారు.  ఆయా పోలీస్ స్టేషన్ ల పరిధిలో ఉన్న క్రిమినల్స్ ను గుర్తించడంలో కీలకంగా వ్యవహరించాలని అన్నారు.

 

 

 

అలాగే విధులు నిర్వహించే సమయాలలో సేఫ్టీ మెజర్స్ పాటించాలని సిబ్బందికి సూచించారు. గస్తీ తిరుగుతున్న ఏరియా నుండి రిపోర్ట్ చేయబడిన అన్ని డయల్100 ఫిర్యాదులను  నిర్ణిత సమయంలో అటెండ్ చేయడంతో పాటు బాధితులకు సత్వర  సేవలు అందించాల్సి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ డిసిపి అఖిల్ మహాజన్ , సిసిఆర్బి  ఇన్స్పెక్టర్ రాజకుమార్, బ్లూ కోల్ట్స్ , పెట్రో కార్స్ వర్టికల్స్ ఇంచార్జ్  లు మంచిర్యాల రూరల్ సీఐ సంజీవ్ , బెల్లంపల్లి 1 టౌన్ ఇన్స్పెక్టర్ రాజు , ఐటి కోర్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రాము, రాజేష్, రమేష్ ,  బ్లూ కోల్ట్, పెట్రో కార్  సిబ్బంది పాల్గొన్నారు.

 

Tags:The role of Blue Colts and Petrocar staff is crucial in crime control

Post Midle

Leave A Reply

Your email address will not be published.