Natyam ad

మానవ మనుగడలో అడవుల పాత్ర ఎంతో కీలకం

నిర్మల్   ముచ్చట్లు:

మానవ మనుగడలో అడవుల పాత్ర ఎంతో కీలకమైందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ అభివృద్ధికి అడవులు ఎంతో అవసరమని తెలియజేయడమే ప్రపంచ అటవీ దినోత్సవం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా అటవీ శాఖ కార్యాలయం నుంచి ప్రొఫెసర్ జయశంకర్ చౌరస్తా వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గండిరామన్న హరితవనంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మొక్కలు నాటారు. పార్క్‌లో మంత్రి కూడా సైక్లింగ్ చేశారు.భవిష్యత్‌ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ జంగల్‌ బచావో – జంగల్‌ బడావో నినాదంతో 2015 సంవత్సరంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు.

 

 

 

 

కేవలం ఎనిమిదేండ్లలోనే 273 కోట్లకుపైగా మొక్కలను నాటి అనుకున్న లక్ష్యాన్ని అధిగమించామని పేర్కొన్నారు. తెలంగాణలో 2015 నుంచి 2021 సంవత్సరాల మధ్య పచ్చదనం శాతం 7.70% పెరిగిందని వెల్లడించారు.అడవుల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న చర్యల ఫలితంగా వన్య మృగాల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందిందని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి వెల్లడించారు. కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో పులుల సంఖ్య పెరిగిందన్నారు. పొరుగున ఉన్న మహారాష్ట్రలోని తడోబా-అంధేరి టైగర్ రిజర్వ్ నుంచి పులులు మన అవాసాలకు వస్తున్నాయని, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కవ్వాల్ టైగర్‌ జోన్‌తో పాటు, ప్రాణహిత, పెన్‌గంగ సరిహద్దు ప్రాంతాల్లో పులుల సంచారం బాగా పెరిగిందని చెప్పారు.అడవులను సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అడవులను నరికి వేస్తే భవిష్యత్ కాలంలో దుష్పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి అడవులను కాపాడుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు విద్యార్థుల్లో అవగాహన పెరగటం చాలా అవసరం అని, తద్వారా వారు మిగతా సమాజానికి సంధానకర్తల్లా పనిచేస్తారని అన్నారు.

Post Midle

Tags;The role of forests is very important in human survival

Post Midle