ఆర్టీసీ నష్టాలు నిజమే .. నిధులిచ్చి ఆదుకుంటున్నం  

– మండలిలో మంత్రి మహేందర్ రెడ్డి
Date:13/03/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
ప్రజలకు ఎంతో చేరువగా ఉన్న ఆర్టీసీ నష్టాలు నిజమే నని సంస్థ నష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వం చేయూతనిస్తుందని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. శాసన సభ 9వ సమావేశంలో మండలి సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి , పురాణం సతీష్ కుమార్, బోడకంటి వెంకటేశ్వర్లు తదితరులు అడిగిన ప్రశ్నలు, అనుభంధ ప్రశ్నలకు సంస్థ నష్టాల కు అనేక కారణాలున్నాయని తెలిపారు.
 ముఖ్యంగా ప్రభుత్వం ఆర్టీసీలో పెంచిన 44% వేతనాలు, సీఎం కేసీఆర్ హామీ ప్రకారం 2015 లో 4001 మంది ఒప్పందం కార్మికుల క్రమబద్ధీకరణ, వేతన స్కేల్ సవరణ బకాయిల చెల్లింపు,ఏటా రెండు సార్లు పెరిగే కరువు భత్యం సెలవులను నగదుగా మార్చే చెల్లింపులు, డీజల్,అయిల్ ధరల పెరుగుదల,వడ్డీల చెల్లింపులు తదితరాలతో సంస్థ మీద భారీ గా భారం పడిందని మంత్రి వెల్లడించారు.
కోట్లాది నిధులతో ఆదుకున్నం …
అయితే నష్టాల ఆర్టీసీ ని ఆదుకునేందుకు గతంలో  ప్రభుత్వాల కంటే ఎక్కువ నిధులు కేటాయించామని చెప్పారు.
గత ప్రభుత్వానికి చెందిన 2013 సవించిన పే స్కేల్ భారాన్ని తగ్గించాలని 2015-16& 2016-17 లలో సంస్థకు రూ. 428.08 కోట్ల నికర మొత్తం ను, 2015-16 లో హైదరాబాద్ నగరంలోని నష్టాల నుండి సంస్థకు సహకారంగా రూ. 336.40 కోట్లు మున్సిపల్ శాఖ అందించిదని తెలిపారు.  2013-14 &2014-15 లకు చెందిన రాయితీల తాలూకు రూ. 500 కోట్లు విడుదల చేసి నిర్వాహణ, పెట్టుబడి కొరతను తీర్చింది. 2017-18 లో ప్రభుత్వం పూచీ ద్వారా రూ. 350 కోట్లు అందించి 2015-16, 2016-17 రెండేళ్ళ  రాయితీ ల మిగులు విడుదల చేసింది. అలాగే బస్ పాస్ రాయితీల రీయింబర్స్ మెంట్ కోసం రూ. 520 సమకూర్చి రూ. 230 కోట్లు విడుదల చేసింది. 2015-16 ,2016-17 లో కొత్త బస్సుల కొనుగోలు కోసం వరుసగా రూ. 38.93, రూ. 10 కోట్లు అందించగా,2017-18 లో బడ్జెట్ లో రూ. 140 కోట్లు కేటాయించి రూ. 70 కోట్లు విడుదల చేసిందని మంత్రి వెల్లడించారు.
 అక్రమ రవాణా లో ఎంతటి పెద్దలనైనా వదలం : మంత్రి మహేందర్ రెడ్డి
రాష్ట్రం లో ఆర్టీసీ ఆదాయాన్ని గండికొడుతూ అక్రమంగా , పరిమితి కి మించి ప్రయాణికులను చేరవేసే, డబుల్ నెంబరు తో అక్రమాలకు పాల్పడే వారి మీద కఠినంగా వ్యవహరిస్తామని ఎంతటి పెద్దల నైనా వదలేది లేదని మంత్రి వెల్లడించారు.  మినీ బస్సులతో కొత్త రూట్లు ఎంపిక చేసి,దూర ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వంటం, సినిమా థియేటర్లు,  పెట్రోలు పంపులు, వాణిజ్య సముదాయాలను ఆర్టీసీ ఖాళీ స్థలాల్లో ఏర్పాటు చేసి ఆదాయాన్ని పెంచుతాం. పల్లె వెలుగు సర్వీసులతో నష్టాలు వచ్చినా ప్రజా సంక్షేమం కోసం ఆదరిస్తాం.సీఎం కేసీఆర్ గత బడ్జెట్ లో ఆర్టీసీ ని ఆదుకునేందుకు రూ. 1000 కోట్లు అందించారని మంత్రి వివరణ ఇచ్చారు.
Tags: The RTC’s losses are true and the money is running

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *