కరీముల్లా ఆత్మహత్యకు కారణమైన ఆర్టిఓ అధికారులను కఠినంగా శిక్షించాలి

తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ డిమాండ్

నంద్యాల ముచ్చట్లు:

నంద్యాల జిల్లా కేంద్రంలో బుధవారం నాడు  తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్  ఆధ్వర్యంలో కరిముల్లా ఆత్మహత్య కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆర్టీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి మరియు రాస్తారోకో చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ మట్లాడుతూ కరిముల్లా ఆత్మహత్య చేసుకొని 22 రోజులు అయినా దోషులకు ఎందుకు ఇప్పుడు వరకు అరెస్టు చేయడం లేదని మూలానా ముస్తాక్ అహ్మద్  ప్రశ్నించారు . కరీముల్లా ఆత్మ హత్యకు కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని  రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు .రాష్ట్ర ప్రభుత్వం కరీముల్లా కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలి.కరీముల్లా పిల్లలకు  చదువుకయ్యే ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి.కరిముల్లా భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.కరిముల్లా కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వాలి.  .కరిముల్లా కుటుంబానికి న్యాయం చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ  పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు నంద్యాల పార్లమెంట్ నాయకులు పట్టణ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: The RTO officials responsible for Karimullah’s suicide should be severely punished

Leave A Reply

Your email address will not be published.