రంజాన్‌ మాసంలో నియమాలు పాటించాలి

పుంగనూరు ముచ్చట్లు:
 
పవిత్ర రంజాన్‌ మాసంలో ముస్లింలు నియమాలు పాటించి , ప్రార్థనలు జరుపుకోవాలని జమాతే ఇస్లామిక్‌హింద్‌ మహిళా అధ్యక్షురాలు షాహినా కోరారు. శనివారం సాయంత్రం పట్టణంలోని ఫలాహ్‌స్కూల్‌లో రంజాన్‌ సత్కార్యాల సమాహారం పుస్తకాలను విడుదల చేసి, మహిళలకు అవగాహన సదస్సును నిర్వహించారు. షాహినా మాట్లాడుతూ ఏప్రిల్‌ 3 నుంచి ప్రారంభమైయ్యే రంజాన్‌మాసంలో ఉపవాసాలు, ప్రార్థనలు నిర్వహిస్తూ, రాత్రి సమయాల్లో ఆరాధనలు, దానధర్మాలు నిర్వహించాలని సూచించారు. వీటి కోసం ముస్లింలు ప్రణాళిక బద్దంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. రంజాన్‌ మాసంలో ఒక్క మంచిపని చేసినా 70 రేట్లు అధికమౌతుందని సూచించారు. ఈ సమావేశంలో మహిళా ప్రతినిధులు హుమేరాభాను, కుర్షిద్‌సాహీరా, సైదాబేగం, చామకానం, ఇఫ్‌షత్‌, రాబియా, జహేదా, అస్మ, షాహిస్తా తదితరులు పాల్గొన్నారు.

Tags: The rules must be followed during the month of Ramadan