Natyam ad

చెత్త పన్ను పై పాలకవర్గం పునరాలోచించాలి

కడప ముచ్చట్లు:

 

చెత్త పన్ను పై పాలక వర్గం పునరాలోచించాలని  డాక్టర్ ఓబుల్ రెడ్డి,  మహేశ్వర రెడ్డి, ప్రదీప్ కుమార్ , సంఘ సేవకులు సలావుద్దీన్ డిమాండ్ చేశారు శనివారం నగరంలోని ఏడు రోడ్ల కూడలి వద్ద సిపియం ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప నగరంలో నగరపాలక సంస్థ విధిస్తున్న చెత్త పన్నుపై పునరాలోచన చేయాలని వారు అభిప్రాయపడ్డారుకడప నగరంలో చెత్త పన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ కడప నగర కమిటీ ఆధ్వర్యంలో కడప నగరంలో బ్యానర్ పై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారుఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై వారు మాట్లాడుతూ కడప నగరంలో సామాన్య మధ్యతరగతితో పాటు ఉన్నత వర్గాల ప్రజల మీద కూడా చెత్త పను భారం పడుతుందన్నారు.

 

 

ఇప్పటికే అనేక రకాల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే గోరుచుట్టు మీద రోకటి పొటులా చెత్త పన్ను వేయటం దారుణం అన్నారు.కడప నగరపాలక సంస్థకు ఆస్తి పన్ను, ఇతరత్రా పన్నులు చెల్లిస్తున్నప్పటికీ మళ్లీ చెత్త పన్ను చెల్లించాలని ఒత్తిడి చేయడం సమంజసం కాదని వారన్నారు.కడప నగర ప్రజలు చెత్త పన్ను మీద పోరాటాలను కొనసాగించి దీన్ని రద్దు చేసే వరకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.జీఎస్టీ రూపంలో అన్ని రకాల వస్తువుల మీద పన్నులు వేస్తున్నారని మళ్లీ చెత్త పన్నెందుకని వారు ప్రశ్నించారు.కడప నగరంలో పాలకవర్గం ఖాళీ స్థలాల మీద పన్నులు వేసి భారాలు మోపుతోందన్నారు.చెత్త పన్ను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

 

 

Post Midle

ఈ కార్యక్రమంలో సిపిఎం కడప నగర కార్యదర్శి ఎ.  రామమోహన్.  లోక్సత్తా నాయకులు కృష్ణ,  హేతువాద సంఘం నాయకులు సిఆర్వి ప్రసాద్ రావు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు చంద్రారెడ్డి,డి. ఎం. ఓబులేసు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మనోహర్ ఐఎన్ సుబ్బమ్మ, జిల్లా కమిటీ సభ్యులు దస్తగిరి రెడ్డి,  పాపిరెడ్డి, నగర నాయకులు పారుక్ హుస్సేన్,  వెంకటేశ్వర్లు, మహబూబ్ తార,   జాఫర్ హుస్సేన్, జమీల, షకీలా, షంషాాద్ వెంకట సుబ్బయ్య, శివరామ్,  వసంత కుమారి, శ్రీనివాసులు, గడ్డం శ్రీను, గోవిందు, రామాంజనేయరెడ్డి,  వాసంత్, ఎం అర్ నాయక్, శివ కుమార్, విజయ్ సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

 

Tags:The ruling class should rethink the garbage tax

Post Midle

Leave A Reply

Your email address will not be published.