అధికార పార్టీ దాడులకు భయపడేది లేదు – మాజీ ఎంపీ రెడ్డెప్ప

– ఆస్తులకు నష్టం సమంజసమా..?
– దాడులతో ఏం సాదిస్తారు..?
-పోలీసుల మౌనంపై కమిషన్‌కు ఫిర్యాదు

పుంగనూరు ముచ్చట్లు:

 

అధికార తెలుగుదేశం పార్టీ వారు ఇష్టానుసారంగా వైఎస్సార్‌సీపీ నాయకులపైన, కార్యకర్తలపైన దాడులు చేయడం , ప్రభుత్వ , ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, తెలుగుదేశం దౌర్జన్యాలను అడ్డుకుంటామని చిత్తూరు మాజీ ఎంపీ ఎన్‌.రెడ్డెప్ప హెచ్చరించారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆగడాలు తీవ్రమైందన్నారు. ఇళ్లపై దాడులు చేసి, ఆడ, మగ , పిల్లలను సైతం భయబ్రాంతులకు గురి చేస్తున్నారని , ఇది మంచిపద్దతి కాదన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. అధికారం వచ్చిందని దౌర్జన్యాలు, దోపిడి చేస్తే ప్రజలు సహించరని, చరిత్ర తిరగబడుతుందనేది గుర్తుంచుకోవాలన్నారు. దాడులతో ఏం సాధిస్తారో చెప్పాలని నిలధీశారు. నియోజకవర్గ ప్రజలచే ఎన్నికైన ఎంపీ, ఎమ్మెల్యేలను తిరగనివ్వమంటు అడ్డుకోవడం, హౌస్‌ అరెస్ట్లు చేయడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అంటు అభివర్ణించారు. గత ముప్పె ఏళ్లుగా తెలుగుదేశం, మిత్రపార్టీ కాంగ్రెస్‌ పార్టీ పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకోవడాన్ని తెలుగుదేశం నాయకులు మననం చేసుకోవాలన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వేలకోట్ల రూపాయలతో ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి లు చేపట్టిన అభివృద్ధిని పరిశీలించాలన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అన్ని పార్టీల వారికి సంక్షేమ పథకాలు అందించామన్నారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం తొలి నెలలోనే వైఎస్సార్‌సీపీ అభిమానులంటు వృద్ధులు, వితంతువుల పెన్షన్‌ను ఆపివేయడం సమంజసమా అంటు నిలధీశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇలా కక్ష్యధోరణితో ఎక్కడైన సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టామా అంటు నిలధీశారు. అధికారం వచ్చినప్పుడు బాధ్యతగా అభివృద్ధి, సంక్షేమం అందించాలని , దాడులతో భయబ్రాంతులకు గురి చేయరాదని తెలిపారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులు , ఆస్తులు విధ్వంసం జరుగుతున్న పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తూ ఉండటంతో మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసి, హైకోర్టులో పోలీసులపై కేసులు దాఖలు చేస్తామని రెడ్డెప్ప తెలిపారు.

 

 

Tags:The ruling party is not afraid of attacks – former MP Reddappa

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *