చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు

The sacred ceremonies ending at the Chandragiri Sri Kodandaramaswamy Temple

The sacred ceremonies ending at the Chandragiri Sri Kodandaramaswamy Temple

Date:21/10/2019

తిరుపతి ముచ్చట్లు:

చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు సోమ‌వారం ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం 6.00 నుండి 7.00 గంటల వరకు స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. ఉదయం 9.00 నుండి 11.00 గంట వరకు ద్వారాతోరణ, ధ్వజకుంభారాధన,  చతుష్టార్చన,  మూర్తిహోమం, శాంతిహోమం, మహాపూర్ణాహుతి, పవిత్ర వితరణ, వేదశాత్‌మొర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉదయం 11.30 నుండి 12.30 గంటల వరకు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతస్వామివారు, శ్రీ సుదర్శన చక్రతాళ్వార్‌లకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. అనంతరం చక్రతాళ్వార్‌కు చక్రస్నానం ఘనంగా నిర్వహించారు.

 

 

అనంతరం సాయంత్రం 6.00 నుండి 7.30 గంటల వరకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవమూర్తులకు వీధి ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో   సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్   కృష్ణారావు, కంకణభట్టర్‌   కృష్ణభట్టర్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్   కృష్ణ చైత‌న్య‌, ఇతర అధికార ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

 

పట్టించుకోని అధికారులు= పోతున్న ప్రాణాలు

Tags: The sacred ceremonies ending at the Chandragiri Sri Kodandaramaswamy Temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *