ఎందరో జాతీయ నాయకుల త్యాగ ఫలం భారత దేశ స్వాతంత్ర్యం

The sacrifice of many national leaders is the independence of India

The sacrifice of many national leaders is the independence of India

– రేణుకారెడ్డి

Date:15/08/2018

పలమనేరు ముచ్చట్లు:

ఎందరో జాతీయ నాయకులు, మహనీయులు, స్వాతంత్ర్య సమరయోధుల కృషి, వారి జీవితాల త్యాగ ఫలంగా నేడు మన భారత దేశ ప్రజలు స్వేచ్చా స్వాతంత్ర్యాలను అనుభవిస్తున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్ రెడ్డి సతీమణి రేణుకారెడ్డి అన్నారు.

 

స్థానిక తెదేపా కార్యాలయ ఆవరణలో 72 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. భారత మాత చిత్ర పటానికి పూజలు నిర్వహించి, జాతీయ జెండా అయిన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జెండా వందనం చేశారు. భారత మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. మిఠాయిలు పంచిపెట్టి స్వాతంత్ర్య దినోత్సవ శుభయతెలుపుకున్నారు.

 

ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జవహర్‌లాల్ నెహ్రూ వంటి ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధులు, త్యాగధనుల దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటాలను, సేవలను కొనియాడారు. జాతీయ నాయకుల జీవితాలను స్పూర్తిగా తీసుకుని నేటి యువత ముందుకెళ్లాలని భారత దేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి చాటి చెప్పాలని ఆకాంక్షించారు.

 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చాంద్ భాషా, ఏఎంసీ చైర్మన్ హేమంత్ కుమార్ రెడ్డి, ఎంపీపీ గీత, జెడ్పీటీసీ సభ్యురాలు శమంతకమణి, నాయకులు జగదీష్ నాయుడు, ఆర్బీసీ కుట్టి, ఖాజా, మల్లీశ్వర్ రెడ్డి, కిరణ్, హరిబాబు, అమరనాథ్ రెడ్డి, లోకేష్, మురళీ, ఎలిజర్, అమానుల్లా, అఫ్రోజ్, రూపేష్, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో  ఆర్గన్ డొనేషన్ అండ్ బ్రెయిన్ డెత్ సర్టిఫికేషన్

Tags: The sacrifice of many national leaders is the independence of India

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *