పోలీసుల త్యాగాలు మరవలేనివి

Date:21/10/2019

కర్నూలు  ముచ్చట్లు:

పోలీసు అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమం  సోమవారం  ఉదయం కర్నూలు కొండారెడ్డి బురుజు ప్రక్కన ఉన్న జిల్లా పోలీసు పెరేడ్ మైదానంలో జరిగంది ఈ సందర్బంగా కర్నూలు రేంజ్ డిఐజి వెంకట్రామిరెడ్డి, జిల్లా జడ్జి ఆలపాటి గిరిధర్, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ డా.కె. ఫక్కీరప్ప, జెసి రవి పట్టన్ షెట్టి తదితరులు సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, అమరులైన పోలీసు వీరులకు ఘనంగా నివాళులను అర్పించారు. కర్నూలు డి.ఐ.జి. వెంకట్రామిరెడ్డి రెడ్డి మాట్లాడుతూ పోలీసు అమరవీరుల త్యాగం, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలను కొనియాడుతూ మరువలేనిది మీ త్యాగం, సదా సంస్మరణనీయమని అన్నారు.

 

 

 

జిల్లా జడ్జి  ఆలపాటి గిరిధర్ మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అసాంఘిక శక్తుల అణచివేత  క్రమంలో ఈ సారి దేశవ్యాప్తంగా 292 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయి అమరులైనారని.. అమరులందరికీ జోహార్లు అన్నారు.పోలీసు అమర వీరుల ప్రాణ త్యాగం.. అందరికీ స్ఫూర్తి దాయకం కావాలన్నారు..పోలీసులంటే నేటి వారి ప్రాణాన్ని ఫణంగా పెట్టి రేపటి మన భవిష్యత్ కోసం సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న పోలీసులందరికీ సెల్యూట్ అన్నారు.కలెక్టర్ జి.వీరపాండియన్ మాట్లాడుతూ పోలీసుల త్యాగాలు, సేవలు మరువలేమన్నారు. ప్రతి శాఖ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం అన్నారు ప్రజలందరూ సంతోషంగా..శాంతి భద్రతల తో ఉన్నామంటే ..పోలీసుల త్యాగమే..అమరులైన పోలీసు వీరులకు జోహార్లు అన్నారు.

 

 

 

 

 

ఎస్పీ డా.కె ఫక్కీరప్ప మాట్లాడుతూ పోలీసుల సంస్మరణ దిన వారోత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల నుండి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పౌర సమాజంలో అన్ని వర్గాల భాగస్వామ్యం తో చేపట్టిన సేవా కార్యక్రమాలను, పోలీసు శాఖ చేపట్టిన శాంతి భద్రతల కార్యక్రమాలపై  అవగాహన,  విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల వివరాలను వివరించారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలు కోల్పోయి అమరులైన పోలీసులు అందరికీ జోహార్లు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ లో పోలీసు యంత్రాంగానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలను తెలిపారు. అనంతరం, ఈ సంవత్సరం  దేశవ్యాప్తంగా అమరులైన  292 మంది పోలీసు అమరుల పేర్లను చదివి వినిపించి వారి ప్రాణ త్యాగాలను సంస్మరణ చేసుకుంటూ..పోలీసు అమర వీరుల స్థూపం వద్ద ఘనంగా పుష్పాంజలి ఘటించారు.

 

డెంగ్యూతో మహిళా న్యాయమూర్తి మృతి

 

Tags: The sacrifices of the police are unforgettable

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *