పుంగనూరులో సమరయోధుల త్యాగాలు మరువలేనివి -ఎంపీపీ భాస్కర్‌రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు మరువలేనివని , సమరయోధుల కుటుంభాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్వాతంత్య్ర సమరయోధుడు, పుంగనూరు తొలి ఎమ్మెల్యే బాడాల కృష్ణమూర్తిరావు కుకుమారై లీలావతి, మనువడు వెంకటప్రసాద్‌లను ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డి , మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహాస్ కలసి శ్యాలువకప్పి , పూలమాలలు వేసి సన్మానించారు. జాతీయ పతాకాలను వారికి అందజేసి, మిఠాయిలు పంపిణీ చేశారు. భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ బాడాల కుటుంబ సభ్యులకు మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి పట్టా , పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవడం జరిగిందన్నారు. వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తె లిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు జయరామిరెడ్డి, దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి, చంద్రారెడ్డి యాదవ్, రమణ, శ్రీనివాసులు, సీతారామయ్య, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు పాల్గొన్నారు.

Tags: The sacrifices of warriors in Punganur are unforgettable – MPP Bhaskar Reddy
