మహిళల భద్రతే తమ ప్రభుత్వ ధ్యేయం

దిశ చట్టంతో “దిశా” నిర్దేశం

Date:14/12/2019

మంత్రాలయం ముచ్చట్లు:

మహిళల భద్రతే తమ ప్రభుత్వ ధ్యేయం అని వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు జి. భీమిరెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని చిలకలడోణ గ్రామ శివారులోని కస్తూరిభా గాంధీ పాఠశాలలో థాంక్స్ టు సీఎం సార్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన దిశ ఘటనను దృష్టిలో ఉంచుకుని మరలా ఇలాంటి సంఘటనలు ఏపీలో పునరావృతం కాకుండా ఉండేందుకు దిశా చట్టం అనే బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టి తీర్మానించడం జరిగిందని దీంతో మానవ మృగాలకు సీయం.జగన్  దిశా నిర్దేశం చేశాడని  రాష్ట్రంలో ఎక్కడైనా ఎంతటి వారైన మహిళపై అత్యాచారం చేసి. హత్యలకు పాల్పడితే వారం రోజులుగా ఆధారాలతో సహా పోస్టుమార్టం నిర్వహించి, డీఎన్ఏ రిపోర్ట్ తెప్పించి రెండో వారం కేసును ట్రైల్ చేపట్టి, మూడో వారం (21 రోజుల్లోనే) నిందితులను ఊరి శిక్ష విధించడం జరుగుతుందని అంతే కాకుండా ఇలాంటి కేసులను విచారణ చేపట్టేందుకు ప్రతి జిల్లా కేంద్రంలో ఒక స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు మహిళలకు ఎవరికైనా మానవ మృగాల నుండి ఎటువంటి ఆపద కలిగినా టోల్ ఫ్రీ నెంబర్లు 112,100,181 ఈ నెంబర్లకు ఫోన్ చేసి చెప్పవచ్చు అన్నారు అనంతరం ఉపాధ్యాయునుల , విద్యార్థినుల  సమక్షంలో కేక్ కట్ చేసి  సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. విద్యార్థినిలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దేవా చంద్ర శేఖర్, మంత్రాలయం మాజీ సర్పంచ్ టి.భీమయ్య, వీఆర్వో ఆనంద్, కస్తూరిబా గాంధీ పాఠశాల సిబ్బంది కృష్ణ వేణి, సునీత తదితరులు పాల్గొన్నారు.

 

ఖోఖో నేపద్యంలో వస్తోన్న రదేరా చిత్ర టీజర్ కు మంచి స్పందన

 

Tags:The safety of women is their government’s mission

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *