Natyam ad

 పెళ్లికి ఒకటే కూర, ఒకటే స్వీటు

-మత పెద్దల తీర్మానం
 
కరీంనగర్  ముచ్చట్లు:
 
కరోనా వైరస్ ప్రభావం మానవాళిపై తీవ్ర ప్రభావం చూపించింది. ఓ వైపు కోరనా వైరస్ వ్యాప్తి.. మరోవైపు అంబరాన్ని అంటున్న నిత్యావసర ధరలు మనిషి తన అలవాట్లు, అభిరుచులను మార్చుకునేలా చేసింది. ముఖ్యంగా పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు వంటి సందర్భాల్లో ఇప్పుడు పెట్టె ఖర్చు తలకు మించిన భారంగా మారిందని మధ్యతరగతి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుట్టిన రోజు వంటి చిన్న చిన్న వేడుకలకే వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక పెళ్ళిళ్ళు అయ్యే ఖర్చులు తలచుకుంటే సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు తలకు మించిన భారమే. ముఖ్యంగా ముస్లింల ఇంట్లో పెళ్లి అంటే ఆర్ధికంగా భారమే అంటూ వాపోతున్నారు. తినుబండారాలు, కూరలు, వంటలు ఎక్కువగా ఖర్చు చేయడంతో వివాహ విందు ఖర్చుపెరిగిపోతుందని.. ఆడపిల్లల కుటుంబాలు వాపోతున్నాయి. దీంతో ఆడపిల్ల కుటుంబాల కష్టాలను తీర్చడానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్లిం మత పెద్దలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ..జిల్లాలోని వేములవాడ పట్టణంలోని మత పెద్దలందరూ కలిసి ఇక నుంచి పట్టణంలో ఎవరి పెళ్లికైనా సరే ఒకటే కూర, ఒకటే స్వీటు ఉండాలని తీర్మానం చేశారు. సాధారణంగా ముస్లిం కుటుంబాల్లో అమ్మాయితరపు ఫ్యామిలీ పెళ్లి వేడుక సమయంలో చికెన్, మటన్‌తో సహా అనేక రకాల వంటలు పెట్టాల్సి ఉంటుంది. బిర్యానీ, చపాతీ రోటీ, కుర్బానీ కా మీఠా, ఖద్దూ కా కీర్, ఐస్‌క్రీం, షేమియా, షీర్‌ కుర్మా.. ఇలా అనేక రకాల వంటకాలను విందు భోజనంలో ఏర్పాటు చేయాల్సిందే. అయితే కరోనా వైరస్ తర్వాత ప్రతి ఒక్కరి ఆర్ధిక స్థితి మారిపోయింది. వ్యాపారాలు సరిగ్గా జరకపోవడంతో నష్టాలు చవిచూశారు. దీంతో గతంలోలా విందు భోజనం ఏర్పాటు చేయడం కష్టంగా మారింది.ఓ వైపు ఆడపిల్లకు ఇచ్చే కట్న కానుకలతో పాటు విందు భోజనానికి అయ్యే ఖర్చులను పేద మధ్య తరగతివారు తట్టుకోలేక మత పెద్దలకు ఫిర్యాదు చేశారు. విందులో ఎంత తక్కువలో వెరైటీలు వడ్డించ్చినా ఆ వెరైటీల ఖర్చు భారీగా అవుతుందని తాము ఈ భారాన్ని భరించలేకున్నాం అంటూ మమ్మల్ని ఒడ్డుకు చేర్చండి అంటూ పేద, సామాన్య కుటుంబాలు విజ్ఞప్తిదీంతో పెళ్లి వేడుక సమయంలో పెరుగుతున్న విందు ఖర్చును నియంత్రించేందుకు వేములవాడలోని షాదీఖానాలో 8 మజీద్‌ కమిటీల పెద్దలు సమావేశమయ్యారు. ఇక నుంచి పట్టణంలో జరిగే పెళ్లిళ్ల విందుల్లో భగారాతో పాటు ఒకటే కూర చికెన్‌ లేదా మటన్‌ మాత్రమే వడ్డించాలని తీర్మానం చేశారు. ఈ తీర్మానం ఫిబ్రవరి 1 వ తేదీ నుంచి అమల్లోకి రానున్నదని తీర్పు చెప్పారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: The same curry for the wedding, the same sweet

Leave A Reply

Your email address will not be published.