మంజూరైన పనులను సద్వినియోగం చేసుకోవాలి

చౌడేపల్లె ముచ్చట్లు:

 

గ్రామాల అభివృద్ది కోసం మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో మంజూరైన అభివృద్ది పనులను సద్వినియోగం చేసుకోవాలని మండల పార్టీ అధ్యక్షుడు రామమూర్తి సూచించారు. బుధవారం మండలంలోని కొండామర్రి సచివాలయంలో అభి వృద్ది పనులపై అధికారులు, కాంట్రాక్టర్లుతో సమావేశం జరిగింది. సచివాలయం, ఆర్‌బికె, విఎల్‌ఎస్‌ భవనాల నిర్మాణలను వేగవంతం చేయాలన్నారు. సిమెంటు రోడ్డు, మురుగునీటి కాలువ ఏర్పాటు పనులపై దృష్టిసారించి నెల రోజుల్లోపు పనులు పూర్తిచేసి ప్రారంభానికి సిద్దం చేయాలని కోరారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరికీ పారదర్శకంగా అందేలా సిబ్బంది పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో సర్పంచ్‌ జయసుధమ్మ, నాగభుషణరెడ్డి ఏఈ పురుషోత్తం. విఆర్వో గుర్రప్ప,పంచాయతీ కార్యదర్శి స్రుకుమార్‌ తదితరులున్నారు.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: The sanctioned works should be utilized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *