తెలంగాణలో కాసుల కురిపిస్తున్న ఇసుక

The sand that poured into the Telangana

The sand that poured into the Telangana

Date:21/06/2019

నల్గొండ ముచ్చట్లు:

రాష్ట్రంలో భవన నిర్మాణాల కార్యకలాపాలు జోరందుకోవడంతో ఇసుకకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఈ ఏడాది ఒక కోటి మెట్రిక్‌టన్నుల ఇసుకను తవ్వి సరఫరా చేయాలని నిర్ణయించింది. వర్షాకాలంలో ఇసుక తవ్వకాలకు ఇబ్బందులు ఎదురవుతాయి.దీంతో ఖనిజాభివృద్థి సంస్థ ముందు జాగ్రత్తగా 60 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను తవ్వి వివిధ గోదాముల్లో భద్రపరిచింది. టీఎస్‌ఎండీసీ అంచనా ప్రకారం రాష్ట్రంలో సాలీనా 1.60 లక్షల క్యూబిక్ మీటర్లు లేక 2.56 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం. ఇందులో టీఎస్‌ఎండీసీ 1.76 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుకను సరఫరా చేస్తోంది. మిగిలిన ఇసుకను ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకుని సరఫరా చేస్తున్నారు.

 

 

 

 

 

 

 

రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న ఇసుక విధానానికి సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలంగాణ విధానాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. 2018-19 సంవత్సరంలో రాష్ట్రప్రభుత్వానికి ఇసుక తవ్వకం, విక్రయాల ద్వారా రికార్డు స్థాయిలో రూ. 886 కోట్ల ఆదాయం వచ్చింది. అంతకు ముందు ఏడాది 2017-18లో రూ.678 కోట్ల ఆదాయం వచ్చింది. ఒక ఏడాదిలో దాదాపు 30శాతం ఆదాయం వృద్ధి చెందింది.

 

 

 

 

 

 

 

ప్రస్తుతం 26 రీచ్‌ల ద్వారా టీఎస్‌ఎండీసీ ఇసుకను సేకరిస్తోంది. 80 శాతం ఇసుకను రిజర్వాయర్ల వద్ద నుంచి సేకరిస్తున్నారు. రిజర్వాయర్ల వద్ద దాదాపు 369 నిల్వ కేంద్రాలను రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసింది. వినియోగదారుల నుంచి వచ్చే డిమాండ్‌ను బట్టి ముందస్తు ప్రణాళికలో భాగంగా ఇసుకను సేకరించి సరఫరా చేస్తున్నారని టీఎస్‌ఎండీసీ అధికారులు చెప్పారు. హైదరాబాద్ శివార్లలో అబ్దుల్లాపూర్‌మెట్, బౌరారం, వట్టినాగులపల్లి వద్ద రాష్ట్రప్రభుత్వం ఇసుక నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేసింది.ఇతర చోట్ల కొత్తగా మూడు ఇసుక నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆన్‌లైన్ ద్వారా కూడా ఇసుకను వినియోగదారులు బుక్ చేసి సొమ్ము చెల్లించి ఆర్డర్ ఇచ్చే విధానాన్ని కూడా టీఎస్‌ఎండీసీ ప్రవేశపెట్టింది.

 

అక్రమార్కులకు బిగిస్తున్న ఉచ్చు

 

Tags: The sand that poured into the Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *