Natyam ad

స్పీకర్ తమ్మినేని సీతారాం కు సొంత పార్టీ సర్పంచ్ లే అసమ్మతి సెగ

చెక్ పవర్ను ఎందుకు రద్దు చేశారు?
స్పీకర్ తమ్మినేని సీతారాం ను నిలదీసిన సర్పంచులు

శ్రీకాకుళం ముచ్చట్లు:


ఏ కారణంతో తమ చెక్పవర్ను రద్దు చేశారో చెప్పాలని జి.కె వలస (గరిమెళ్ల కొత్తవలస) సర్పంచ్ పంగ సుగుణ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంను ప్రశ్నించారు. మండలంలోని చీమలవలస, సిరిసింపేట, నిమ్మతొర్లాడ, జి.కె వలసలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్పీకర్ సీతారాం శంకుస్థాపన చేసేందుకు వెళ్లిన సందర్భంలో జి.కె వలసలో సర్పంచ్ సీతారాంను చెక్పవర్పై ప్రశ్నించగా, ఏమైనా ఉంటే తమ ఇంటి వద్దకు వచ్చి మాట్లాడాలని స్పీకర్ బదులిచ్చారు. వైసిపిలో గ్రూపులను ప్రోత్సహించి పార్టీని నాశనం చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని సర్పంచ్ భర్త సతీష్, వారి అనుచరులు స్పీకర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న మీడియాను స్పీకర్ గన్మెన్లు నిరోధించారు. దీంతో స్పీకర్ అక్కడ్నుంచి వెనుదిరిగారు. రెండేళ్లుగా తనకు వృద్ధాప్య పింఛను, తన భార్యకు చేయూత అందడం లేదని చీమలవలసకు చెందిన వడిశ నరసింంగరావు స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. తమ గ్రామానికి వచ్చిన ప్రతిసారీ ఈ సమస్యను చెప్తున్నా, ఇంతవరకు పరిష్కారం కాలేదని వాపోయాడు. అదే గ్రామానికి చెందిన తమ్మినేని లక్ష్మి తనకూ చేయూత పథకం అందడం లేదని తెలిపారు. స్పీకర్ వెంటనే సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ కూన సత్యనారాయణను పిలిచి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. చీమలవలసలో మురుగునీరు పోయేందుకు కాలువలు నిర్మించడానికి నిధులను మంజూరు చేయాలని సర్పంచ్ సనపల చెల్లంనాయుడు, గ్రామస్తులు స్పీకర్కు వినతిపత్రం అందించారు.

 

Post Midle

Tags: The Sarpanch of his own party disagreed with Speaker Tammineni Sitaram

Post Midle