ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదింపచేయాలి

Date:15/09/2020

తుగ్గలి  ముచ్చట్లు:

మాదిగ ఉపకులాల ఎస్సీ వర్గీకరణ బిల్లు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి  కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏకపక్షంగా ఆమోదింప చేసేందుకు కృషి చేయాలనిఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు గుమ్మనూరు జయరాం ను తన స్వగృహం నందు ఆలూరు లో మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టీఎం రమేష్ మాదిగ కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపుగా 26 సంవత్సరాల నుండి మాదిగ,మాదిగ ఉపకులాల ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదింప చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మాదిగ మహా మేధావులు ప్రభుత్వాలపై పోరాటాలు చేసి ఎంతోమంది బలిదానం అయి ఉన్నారు. అయినప్పటికీ మాదిగల చిరకాల వాంఛ అయినటువంటి ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదింపజేయడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూనే వస్తున్నాయి.సుప్రీం కోర్టు ధర్మాసనం జస్టిస్ అరుణ్ మిశ్రా విస్తృతస్థాయి సమావేశం నందు మాదిగలు వెనకబడి ఉన్నారని,వారికి రిజర్వేషన్ ఫలాలు అందాలంటే ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం చేయడం న్యాయమని అందుకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం తెలుపుకోవచ్చని సుప్రీంకోర్టు ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా తీర్పు నివ్వడం జరిగింది.

 

 

 

ఈ తీర్పు కు అనుగుణంగా అడగకుండానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్ మాదిగలకు కూడా ఎస్సీ వర్గీకరణ బిల్లు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో తన మంత్రులతో చర్చించి బిల్లును ఏకపక్షంగా అసెంబ్లీలో ఆమోదింప చేసేందుకు  రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు గుమ్మనూరు జయరాం కృషిచేసి మాదిగల చిరకాల వాంఛ అయినటువంటి ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం తెలిపేందుకు కృషిచేసి మాదిగల అభివృద్ధికి బాటలు వేయాలని మంత్రివర్యులు కు డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో
ఎం.ఆర్.పి.ఎస్.ఎస్ పత్తికొండ ప్రధాన కార్యదర్శి మద్దిలేటి మాదిగ,ఎంఆర్పిఎస్ఎస్ తుగ్గలి మండలం అధ్యక్షుడు రామాంజనేయులు మాదిగ,ఎంఆర్పిఎస్ఎస్ పత్తికొండ నియోజకవర్గం ఇంచార్జ్ ప్రతాప్ మాదిగ, ఎంఆర్పిఎస్ఎస్ తుగ్గలి మండలం ప్రధాన కార్యదర్శి రాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు.

వైయస్సార్ ఆసరా వారోత్సవాలు

Tags: The SC Classification Bill must be passed in the Assembly

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *