Natyam ad

అయ్యప్ప మాలతో వచ్చిన బాలికను అడ్డుకున్న స్కూలుయాజమాన్యం

రంగారెడ్డి ముచ్చట్లు:

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బండ్లగూడ లో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అతి ఉత్సాహం చూపించింది. అయ్యప్ప మాల వేసుకుంటే స్కూల్ లోకి నో ఎంట్రీ.. స్కూల్ డ్రేస్ ఉంటేనే స్కూల్ లోకి అనుమతి అంటూ యాజమాన్యం  చిన్నారిని తోసేసింది.  చిన్నారి గంట పాటు ఎండ లోనే నిలబడింది. తరువాత స్కూలు వాళ్లు చిన్నారి న తండ్రి సమాచారం ఇచ్చారు. దాంతో తండ్రి వచ్చి స్కూల్ యాజమాన్యాన్ని నిలదీసాడు. ఎందుకు రానివ్వరో చెప్పండి అంటూ ప్రశ్నించాడు. మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేయడానికి ప్రయత్నిస్తే, అడ్డుకున్నారు. దాంతో అయన అందోళనకు దిగాడు.

Post Midle

Tags: The school management stopped the girl who came with Ayyappa Mala

Post Midle