వర్షానికి ఉరుస్తున్న పాఠశాల, బురదమయమైన రోడ్లు

The school, the muddy roads

The school, the muddy roads

Date:20/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

ప్రతి రోజు కురుస్తున్న వర్షాలకు గ్రామీణ ప్రాంతాల రోడ్లు బురదమయమై, ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారుతోంది. అలాగే పాఠశాల పైకప్పులు ఊడిపోవడంతో పాఠశాలలో వర్షపు నీరు చేరి విద్యార్థులకు ఇబ్బందికరమౌతోంది. మండలంలోని నల్లగుట్లపల్లె తాండా ఎలిమెంటరీ పాఠశాలలో 45 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇలా ఉండగా పాఠశాల పై కప్పు పెచ్చులూడిపోయి వర్షపు నీరు గదుల్లో చేరిపోవడంతో విద్యార్థులు కూర్చోలేక నీటిని తొలగించుకోవడానికి సరిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాదాలు జరిగితే నష్టం ఊహించలేమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తక్షణం చర్యలు తీసుకుని, భవనాల మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

అధ్వాన్నంగా కొండసముద్రం రోడ్డు….

వర్షాలకు రోడ్లు అధ్వాన్నంగా మారిపోయాయి. ఎంబిటి రోడ్డు, బైపాస్‌రోడ్డు, బస్టాండులో గుంతలు పడి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఎంబిటి రోడ్డు జాతీయ రహదారి నుంచి కొండ సముద్రం గ్రామానికి వెళ్లే రోడ్డు రొచ్చురొచ్చుగా మారిపోవడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి మట్టి రోడ్డు ఉండటంతో వర్షాలకు రోడ్డులో నీరు నిలిచి గుంతలు చెరువులను తలపిస్తోంది. రోడ్డు బురదమయంకావడంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. ఈ విషయమై మంత్రి పెద్దిరెడ్డి చర్యలు తీసుకుని రోడ్డు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

100 కోట్ల ఆఫర్ బిడ్డింగ్ లో జీహెచ్ఎంసీ

Tags: The school, the muddy roads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *