జిల్లా ప్రభుత్వ కార్యాలయ కోసం అన్వేషణ సాగుతోంది
-నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్
నంద్యాల ముచ్చట్లు:
జిల్లా ప్రభుత్వ కార్యాలయాల కొరకు భవనాలను .నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్వేషణ సాగుతోందని అన్నారు. .మంగళవారం నంద్యాల పట్టణంలో. జిల్లా ప్రభుత్వ కార్యాలయాల కొరకు అనువైన భవనాలను నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, రహదారులు మరియు భవనాల శాఖ యస్ ఇ శ్రీధర్ రెడ్డి, ఇఇ సురేష్ బాబు, ఎస్ఆర్బిసి ఈ ఈ. లతో కలిసి పరిశీలించారు.
అనంతరం నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్. మాట్లాడుతూ నంద్యాల పట్టణం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నందున ఉన్నత అధికారుల ఆదేశానుసారం మంగళవారం నాడు నంద్యాల పట్టణంలోని ఎస్ ఆర్ బి సి కాలనీ ఆవరణంలోని ఎస్ఆర్బిసి కార్యాలయాలు నూనెపల్లె మార్కెట్ యార్డ్. నూనెపల్లె సమీపంలోని ఆర్ ఏ ఆర్ ఎస్ ఆవరణంలోని భవనాలను పరిశీలించడం జరిగింది అని అన్నారు. ప్రతిపాదనలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతోందని సబ్ కలెక్టర్ తెలియజేశారు.
వీరి వెంట ఎస్ ఆర్ బి సి.. రహదారులు మరియు భవనాల శాఖ ఇఇ సురేష్ బాబు .డిఈ . సుబ్బరాయుడు. ఆర్ ఎ ఆర్ ఎస్.శాస్త్రవేత్తలు. తదితరులు ఉన్నారు.
Tags: The search for a district government office is ongoing