పుంగనూరులో రెండవ రోజు చురుగ్గా టీకాల కార్యక్రమం
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు మున్సిపాలిటిలో చైర్మన్ అలీమ్‌బాషా, కౌన్సిలర్ కిజర్‌ఖాన్ ఆధ్వర్యంలో టీకాల కార్యక్రమాన్ని మంగళవారం చురుగ్గా కొనసాగించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రెడ్డికార్తీక్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది పట్టణంలోని 16 కేంద్రాలలో 1053 టీకాలు వేశారు. అలాగే రూరల్ మండలంలో మెడికల్ ఆఫీసర్ సల్మాసుల్తాన ఆధ్వర్యంలో 21 కేంద్రాల్లో 411 టీకాలు వేశారు. డాక్టర్ రెడ్డికార్తీక్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామని , టీనేజ్లోపు పిల్లలందరికి పాఠశాలల్లో పకడ్భంధిగా టీకాలు వేస్తున్నామని , ఆన్లైన్ నమోదు చేపడుతున్నట్లు తెలిపారు. మెడిసన్ కొరత లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వలంటీర్లు , సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్మోహన్రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: The second day of active vaccination program in Punganur