రైతన్నలకు రెండో విడత ఆర్ధిక చేయూత

Date:06/10/2018
కామారెడ్డి ముచ్చట్లు:
దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులకు పెట్టుబడి సాయంగా రూ.8వేలు ఇస్తోంది తెలంగాణ సర్కార్. ఎకరాకు రూ.8వేలు చొప్పున రెండు విడతలుగా చెల్లిస్తున్న ఈ సొమ్ము అన్నదాతలకు ప్రయోజనకరంగా ఉంటోంది. పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయిన ఈ రోజుల్లో ప్రభుత్వం అందించే సాయం వారిని ఆదుకుంటోందనడంలో సందేహంలేదు.
ఇప్పటికే ఖరీఫ్‌కు సంబంధించిన రైతుబంధు చెక్కులు రైతులు అందుకున్నారు. సాగుకు వినియోగించుకున్నారు. ప్రస్తుతం రబీకి సంబంధించిన చెక్కులు సిద్ధమయ్యాయి. పంపిణీ కూడా ప్రారంభమైంది. ఈ దఫా ఎలాంటి సమస్యలకు తావులేకుండా అర్హులైన రైతులందరికీ చెక్కులు అందించేలా చర్యలు తీసుకుంది అధికార యంత్రాంగం. కామారెడ్డి జిల్లా విషయానికి వస్తే జిల్లాలో దాదాపు 2.4 లక్షల మందికిపైగా రైతులకు రైతుబంధు సాయం లభించే అవకాశం ఉంది.
471గ్రామాల్లోని రైతులకు ఆర్ధిక సాయం దక్కనుంది. జిల్లాలో వ్యవసాయభూమి విస్తీర్ణం సుమారుగా 4.6లక్షల ఎకరాలు ఉంటుంది. రైతులు 2, 44వేల మందికిపైగానే ఉన్నారు. దీంతో రైతుబంధు చేయూత నిమిత్తం జిల్లా బడ్జెట్‌ రూ.196కోట్ల పైగానే తేలింది. ఈ బడ్జెట్ మొదటి విడత నాటి మాట. రెండో విడతలోనూ దాదాపు ఇంత మొత్తంలోనే లెక్క తేలే అవకాశాలున్నాయి.
ఇదిలాఉంటే మొదటి విడతలో చెక్కులు అందుకోని రైతులు 30వేల మందికిపైగానే ఉన్నారు. ఈ చెక్కులను కూడా క్లియర్ చేయాలని, రైతుబంధు పథకం సజావుగా సాగేలా చూడాలని అధికారులు ప్రణాళికలు వేసుకున్నారు. ఇదిలాఉంటే పెట్టుబడి సాయంగా రూ.4వేలు అందుతుండడంతో రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
Tags: The second installment of the farmers is financing

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed