రెండవ విడత వాహన మిత్ర పథకం ప్రారంభం

– నాలుగు నెలలకు ముందే డ్రైవర్ల ఖాతాలోకి 10,000 రూ నగదు జమ
– కొత్తగా ఆటోలు కొన్న వారికి కూడా ఈ పథకం వర్తింపు

Date:04/06/2020

తుగ్గలి  ముచ్చట్లు:

తుగ్గలి మండల పరిధిలో గల ఆటో,టాక్సీ,మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ లకు రెండవ విడత వైయస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాలో 10000 రూపాయలు జమ అయ్యాయి.తుగ్గలి మండల పరిధి లోని గల గుత్తి ఎర్రగుడి గ్రామంలోని గ్రామ సచివాలయం వద్ద వైయస్సార్ వాహన మిత్ర లబ్ధిదారులైన ఆటోడ్రైవర్లకు వైసీపీ మండల కన్వీనర్ జిట్టా నాగేష్,రామచంద్రారెడ్డి లు ధృవ పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ కరోనా,లాక్ డౌన్ వల్ల ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా ఉపాధి కోల్పోయిన డ్రైవర్ల కోసం నాలుగు నెలల ముందుగానే సీఎం జగన్ మోహన్ రెడ్డి డ్రైవర్లకు రెండవ విడత పదివేల రూపాయలు నగదును ఖాతాలో జమ చేశారని వారు తెలియజేశారు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీలను సీఎం జగన్ మోహన్ రెడ్డి తప్పకుండా నెరవేరుస్తారని వారు ధీమా వ్యక్తం చేశారు.అదేవిధంగా ఈ నెల 8 న ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని వారు తెలియజేశారు.

 

 

 

 

ఈ కార్యక్రమంలో భాగంగా సచివాలయ ఉద్యోగులు మాట్లాడుతూ గతేడాది సెప్టెంబర్ 23 నుండి ఈ ఏడాది మే 16 వరకు వాహనాలు కొనుగోలు,యాజమాన్య హక్కులు పొందిన వారికి కూడా ఈ పథకం వర్తింపు చేస్తుందని వారు తెలియజేశారు.అర్హత ఉండి వాహన మిత్ర నగదు జమ కాకుంటే గ్రామ సచివాలయంలో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు.అర్హులని తేలితే వారికి వెంటనే వాహన మిత్ర పథకం ను అమలు చేస్తామని సచివాలయ ఉద్యోగులు తెలియజేశారు.ప్రతి ఒక్క వాహనానికి ఇన్సూరెన్స్,ఫిట్నెస్ సర్టిఫికెట్లు చేయించుకుని, మద్యం సేవించకుండా,ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలని అధికారులు ఆటో డ్రైవర్ల కు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి అభ్యర్థి పులికొండ నాయక్,వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ మాధవ సూర్య తేజ,పంచాయతీ కార్యదర్శి నాగేంద్ర,గ్రామ సచివాలయ ఉద్యోగులు,గ్రామ వాలంటీర్లు, ఆటోడ్రైవర్లు,వైసిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సత్యవేడులో ఆరులారీలను పట్టుకున్న అధికారులు.

Tags: The second phase is the launch of the Vehicle Alliance scheme

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *