‘కాఫీ విత్ కరణ్’ రెండో సీజన్….

The second season with coffee with Karan ....
Date:12/10/2018
ముంబై ముచ్చట్లు:
మనదేశంలో అత్యంత విజయవంతమైన టీవీ షోల్లో ‘కాఫీ విత్ కరణ్’ ఒకటి. దేశవ్యాప్తంగా ఈ షోకు మంచి ప్రజాదరణ ఉంది. ఈ షోను అనుకరిస్తూ ప్రాంతీయ భాషల్లోనే అనేక షోలు పుట్టుకొచ్చాయి. ఆయా ప్రాంతాల్లో ప్రేక్షకులను అకట్టుకున్నాయి. అయితే, కరణ్ షోకు ఉన్న స్థాయిలో భారీ ఆదరణ మాత్రం ఇతర ఏ షోకూ లేదంటే అతిశయోక్తి కాదు. కరణ్ తన షోకు వచ్చే అతిథుల కాంబినేషన్ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటాడు. వచ్చే పెయిర్స్ ప్రేక్షకులకు ఇంట్రెస్టింగ్గా ఉండేలా చూస్తాడు. మాజీ ప్రేమికులను జంటగా తీసుకొచ్చి షోలో కూర్చోబెడతాడు. ఒకరంటే ఒకరికి పడనివారిని జట్టు కట్టిస్తాడు. సోనమ్ కపూర్-దీపికా పదుకొణె, రణబీర్-రణ్వీర్లను కరణ్ తన షోకు జంటగా తీసుకొచ్చిన విషయాన్ని ఎవ్వరూ ఎప్పటికీ మరిచిపోలేరు.
అంతగా సక్సెసయ్యాయి.. జనానికి వినోదాన్ని పంచాయి ఆ ఎపిసోడ్లు. తన షోలో వివాదాలను ప్రస్తావించడానికీ కరణ్ ఏమాత్రం వెనకాడడు. కంగనా రనౌత్‌తో ఎపిసోడ్ ఈ కోణంలోనే జనానికి చేరువయ్యింది. తాజాగా ‘కాఫీ విత్ కరణ్’ కొత్త సీజన్ ప్రారంభమవ్వబోతోంది. దీంతో ఈసారి కరణ్ ఎవరెవర్ని అతిథులుగా పిలవబోతున్నాడు? ఎవరెవరు జంటగా రాబోతున్నారు? అనే ఆసక్తి జనాల్లో నెలకొంది. వారి ఆసక్తి, అభిరుచికి తగ్గట్లుగానే కరణ్ కొత్త సీజన్‌కు సరికొత్త జంటలతో సిద్ధమవుతున్నాడు. ఈ దఫా షోకు అలియా భట్-దీపికా పదుకొణె, అర్జున్ కపూర్-ఝాన్వీ కపూర్ వంటి వారు జంటగా రానున్నారు. అలియా ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్ గర్ల్‌ఫ్రెండ్ కాగా.. దీపిక ఒకప్పటి గర్ల్‌ఫ్రెండ్. దీంతో వారి కాంబినేషన్ ఆసక్తి కలిగిస్తోంది.
ఇక అర్జున్ కపూర్, ఝాన్వీ సవతి తల్లుల పిల్లలు. వారి తండ్రి బోనీ కపూర్. అతిలోక సుందరి శ్రీదేవీ మరణం తర్వాతే అర్జున్ ఆమె పిల్లలతో కలిశాడు. దీంతో తన చెల్లి ఝాన్వీతో కలిసి అర్జున్ షోకు రాబోతుండటంతో.. వారి ఫ్యామిలీ విషయాలు అనేకం బయటి ప్రపంచానికి తెలిసే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, సుప్రీంకోర్టు ఇటీవలే తన తీర్పులతో.. స్వలింగ సంపర్కం నేరం కాదని తేల్చింది. అక్రమ సంబంధమూ నేరం కాదని స్పష్టం చేసింది. దీంతో వాటిపై అభిప్రాయం చెప్పాలంటూ అతిథులను కరణ్ కోరతారని.. ఆ కోణాల్లో వారి జీవితాల్లోని ఘటనలను రాబట్టే అవకాశముందని ఊహాగానాలు వెలువడుతున్నాయి.
Tags:The second season with coffee with Karan ….