జిల్లా వ్యాప్తంగా సచివాలయాలు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి  పంచాయతీ రాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్

నెల్లూరు   ముచ్చట్లు:
జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ ఎస్ ఈ శ్రీనివాసులు రెడ్డి స్వష్టం చేశారు.  కోట పట్టణంలోని పాత మండల పరిషత్ స్థలంలో నిర్మాణం జరుగుతున్న సచివాలయం 2,3 భవనాలను  స్పెషల్ డ్రైవ్ లో భాగంగా జిల్లా పంచాయతీరాజ్‌ ఎస్ ఈ శ్రీనివాస్ రెడ్డి,  ఎంపిడిఓ భవాని, ఈ ఓ పి ఆర్ డి  స్వరూప రాణి, సచివాలయం ఇంజినీరింగ్‌, రెవెన్యూ గ్రామ కార్యదర్శులు,పంచాయతీ కార్యదర్శి మరియు వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లప రెడ్డి వినోద్ రెడ్డి లు పరిశీలించారు. ఈ సందర్భంగా  ఎస్ ఈ మాట్లాడుతూ గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల భవనాలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. చాలా గ్రామాల్లో సచివాలయాలు పూర్తి కాలేదని, వెంటనే ప్రారంభించాలన్నారు. వాటికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామన్నారు. ఎక్కడైనా సచివాలయ నిర్మాణానికి స్థల వివాదం ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు. వీటి నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని, లేకుంటే చర్యలు తప్పవన్నారు. నాడు-నేడు పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.ప్రతి మండలంలో  సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు పరివేక్షణ కొరకు స్పెషల్ డ్రైవ్ కమిటీ ఏర్పాటు చేయబడింది అనీ కమిటీలో ఎంపీడీఓ తో ఉంటుంద న్నారు.స్పెషల్ డ్రైవ్ లో భాగంగా కోట లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు పరిశీలించి కాంట్రాక్టర్లు తో చర్చిండం జరిగింది అని ఆయన తెలిపారు. త్వరితగతిన భవనాలు పూర్తి చేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. నిర్మాణాల్లో ఎక్కడ జాప్యం గాని,నాణ్యత లేకుండా పనులు జరిగిన అందుకు కమిటీ బాధ్యత వహించాలి అని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఈ ఈ వై. వి శివ రెడ్డి, డి ఈ రవీంద్ర కుమార్, ఎంపీడీఓ భవానీ, ఈ ఓ పి ఆర్ డి స్వరూప రాణి,కోట ఏ ఈ ఈ  కిరణ్,వాకాడు ఏ ఈ ఈ దానియల్,సచివాలయం ఇంజినీరింగ్ లు షాలిని, హిముజా, పంచాయతీ కార్యదర్శి నెలవల రాజ శేఖర్ మరియు వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లప రెడ్డి వినోద్ రెడ్డి, ఉప సర్పంచ్ గాది భాస్కర్, కాంట్రాక్టర్ షేక్ మస్తాన్ బాషా తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags:The secretariats across the district should be completed within the stipulated time
Panchayati Raj Superintendent Engineer

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *