అమ్మ ఒడి లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి

Date:12/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వాదేశాల మేరకు ఉపాధ్యాయులందరు తమ పరిధిలో అమ్మ ఒడి పథకంలో పెండింగ్‌ ఉన్న విద్యార్థుల తల్లుల జాబితాలను తక్షణమే పూర్తి చేయాలని ఎంఈవో కేశవరెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమ్మ ఒడి వెబ్‌సైట్‌ ద్వారా అభ్యంతరాలను నమోదు చేసుకుంటుందన్నారు. అర్హుల జాబితాలను ఆయా సచివాలయాల కార్యదర్శుల లాగిన్‌లో పూర్తి చేసి పంపాలని సూచించారు. ఈ విషయమై ఉపాధ్యాయులు తమ పరిధిలోని లబ్ధిదారులకు సూచించాలన్నారు. అలాగే అమ్మ ఒడికి సంబంధించి గ్రామ సచివాలయలలోని విద్యాశాఖ సహాయకులు అమ్మ ఒడి జాబితాలను పూర్తి చేసి, గురువారంలోపు ఎంఈవో కార్యాలయంలో అందజేయాలని ఆయన తెలిపారు.

పక్కా గృహాల నిర్మాణాలకు భూ సేకరణ

Tags: The selection of beneficiaries of Amma OD must be completed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *