19న ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీల లబ్ధిదారుల ఎంపిక

Date:16/11/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపాలిటి పరిధిలోని ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీ, క్రిష్టియన్‌, కాపు, ఆర్యవైశ్య కులాల సంస్థల ద్వారా లబ్ధిదారుల ఎంపిక ఈనెల 19న నిర్వహిస్తున్నట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. శనివారం కమిషనర్‌ మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకున్న మైనార్టీ, ఎస్సీ వారికి, 20న ఎస్టీ, బీసీ, క్రిష్టియన్‌ , మైనార్టీ, కాపులకు , ఆర్యవైశ్యుల వారికి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాంకుల వారిచే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. ధరఖాస్తు దారులు తమ సర్టిపికెట్లతో లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమానికి తప్పక హాజరుకావాలని ఆయన కోరారు.

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యం

Tags: The selection of beneficiaries of SC, ST, BC and minority on 19th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *