పోలింగ్ బూత్‌లో వీవీప్యాట్‌లో పాము దర్శనమిచ్చింది

Date:23/04/2019
తిరువనంతపురం ముచ్చట్లు:
లోక్ సభ ఎన్నికల మూడో విడత పోలింగ్‌ సందర్భంగా విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. కేరళలోని ఓ పోలింగ్ బూత్‌లో వీవీప్యాట్‌లో ఓ పాము దర్శనమిచ్చింది. దీంతో పోలింగ్ అధికారులు, సిబ్బందితో పాటు ఓటర్లు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఆ పామును ఎలాగోలా వీవీప్యాట్‌ నుంచి తీసి అక్కడికి కాస్త దూరంగా వదిలేసి వచ్చి పోలింగ్‌ను యథావిధిగా కొనసాగించారు. మొత్తానికి ఆ పాము కారణంగా పోలింగ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. వీవీప్యాట్‌లోకి పాము ఎలా, ఎప్పుడు దూరిందనే విషయం సందిగ్ధంగా మారింది. కేరళలోని కన్నూర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మయ్యిల్‌ కందక్కయ్‌ పోలింగ్‌ బూత్‌లో మంగళవారం (ఏప్రిల్ 23) ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ పీకే శ్రీమతి (సీఎఎం, ఎల్‌డీఎఫ్ ఉమ్మడి అభ్యర్థి) బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి సురేంద్రన్, బీజేపీ నుంచి పద్మనాభన్ పోటీ చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల మూడో విడతలో భాగంగా దేశంలోని 117 స్థానాల్లో పోలింగ్‌ ముగిసింది. 13 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు  ముగిశాయి. గుజరాత్‌లో 26, కేరళలో 20, ఉత్తరప్రదేశ్‌లో 10, ఛత్తీస్‌గఢ్‌లో 7, ఒడిశాలో 6, అసోంలో 4, బిహార్‌‌లో 6, పశ్చిమ బెంగాల్‌లో 6, మహారాష్ట్ర 14, కర్నాటకలో 14 స్థానాలు; గోవా, త్రిపుర, దాద్రా నగర్‌ హవేలి, డామన్‌ డయ్యూ, త్రిపురల్లో ఒక్కో స్థానం చొప్పున ఎన్నికలు జరుగుతున్నాయి.
Tags:The serpent was spotted in the polling booth in the polling booth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *