ఎమ్మెల్యేను నిలదీసిన సర్పంచులు
మహబూబాబాద్ ముచ్చట్లు:
పైసా లేదు సభకు ఎందుకు రావాలి అని ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ని ప్రజాప్రతినిధులు నీలాదీశారు.సర్పంచ్ గా బాధ్యతలు లు చేపట్టినప్పటి నుంచి ఇంతవరకు ఒక్క పైసా దిక్కులేదని ఏముందని మండల సభకు రావాలి అంటూ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, బొద్దుగొండ సర్పంచ్ ముక్కా లక్ష్మణ్ రావుతో పాటు పలువురు సర్పంచులు ఎమ్మెల్యే శంకర్ నాయక్ ని ప్రశ్నించిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ బాణోతు సుజాత అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పటివరకు జరిగిన మండల సభకు హాజరు కాని వివిధ శాఖల అధికారులందరూ ఈ రోజు హాజరుకాగా మండలంలోని 39 జీపీల సర్పంచులలో 9 మంది ఎంపీటీసీలు 10 మంది హాజరయ్యారు. వారి హాజరు శాతాన్ని చూసిన ఎమ్మెల్యే సర్పంచుల కు ఎక్కువైందా..?ఎందుకని రాలేదన్నారు. మండలానికి ఎస్డీఎఫ్ నిధులు వచ్చాయి. వచ్చిన వారికే ఈ నిధులు ఇవ్వమనీ ఎంపీడీవో రోజారాణికి ఎమ్మెల్యే సూచించారు.

ఆ మాటలు విన్న సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు ముక్కా లక్ష్మణ్ రావు మాట్లాడుతూ సార్ ఇంటి దగ్గర నుంచి గూడూరు కు రావడానికి కూడా సర్పంచుల వధ్ధ డబ్బులు లేవు ఎలా వస్తారని అడిగారు. పాటిమిది తండా సర్పంచ్ రాధ జీపీకీ రావాల్సిన డబ్బుల వివరాలు రాసి వినతిపత్రం అందించడంతో ఎమ్మెల్యే కంగుతిన్నారు. అధికార పార్టి వారే ఇలా చేస్తే ప్రతిపక్ష పార్టీల వారి పరిస్థితి ఏంటని ఎమ్మెల్యే సర్పంచులను ప్రశ్నించారు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను తొందరలో వచ్చేలా చేస్తాననీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తెలిపారు. కొంత సేపు సర్వసభ్య సమావేశంలో మాటల యుద్ధం నడిచింది.
Tags;The serpents who deposed the MLA
