ఆశ వర్కర్ల సేవలు మరువలేనివి-మంత్రి అల్లోల

-ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ చేసిన  మంత్రి అల్లోల
నిర్మల్ ముచ్చట్లు:
 
 
కరోనా కష్ట కాలంలో ఆశా వర్కర్లు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా వారు   చేసిన సేవలు మరువలేనివని  అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం   కలెక్టర్ కార్యాలయంలో నిర్మల్  నియోజక వర్గానికి చెందిన 280 మంది ఆశా కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లను  మంత్రి అల్లోల పంపిణి చేసారు. ఈ సందర్బంగా  ఆయన మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి
కెసిఆర్  అన్ని రంగాల వారికి సమన్యాయం చేస్తున్నారన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందజేయాలనే ఉద్దేశంతో ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సాంకేతికను
సద్వినియేగం చేసుకుని ఆశా కార్యకర్తలు ప్రజలకు ఇంకా మెరుగైన వైద్య సేవలందించాలని కోరారు. మరోవైపు ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఉమ్మడి
పాలనలో రూ.1500 గా ఉండే ఆశా వర్కర్ల జీతాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చాక రూ.9750 చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.
 
Tags:The services of Asha workers are unforgettable-Minister Allola