కోవిడ్ మొదటి, రెండవ దశ వ్యాప్తి నియంత్రణలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరి సేవలు అభినందనీయం

చిత్తూరు   ముచ్చట్లు:

కోవిడ్ మూడవ దశ వ్యాప్తి పై అప్రమత్తం గా వ్యవహరిద్దాం . . సమిష్టిగా పని చేద్దాం
జిల్లాలో అందుకు అనుగుణంగా వైద్య సేవలకు సంబంధించి మౌలిక సదుపాయాల ఏర్పాటు పై దృష్టి సారించండి జిల్లా కలెక్టర్ , కోవిడ్ మొదటి, రెండవ దశ వ్యాప్తి నియంత్రణలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరి సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్ తెలిపారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో కోవిడ్ – 19 మూడవ దశ వ్యాప్తికి సంబంధించి జిల్లాలో గల ఆసుపత్రులలో గల వైద్య సదుపాయాల పై జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్లు (అభివృద్ధి, సంక్షేమం) వి.వీరబ్రహ్మం, ఎన్. రాజశేఖర్లు, ట్రైనీ కలెక్టర్ అభిషేక్ కుమార్ లతో కలసి స్విమ్స్, రుయా, సూపరింటెండెంట్లు డా. రామ్, డా. భారతి, డి ఎం అండ్ హెచ్ ఓ, డి సి హెచ్ ఎస్ లు డా. శ్రీహరి, డా. సరళమ్మ, డిఐఓ హనుమంత రావు, వై.ఎస్.ఆర్ ఆరోగ్యశ్రీ కొ ఆర్డినేటర్ బాలాంజనేయులు, తిరుపతి మెటర్నిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. చంద్రశేఖరన్, ఎస్వి మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డా. జయా భాస్కర్, నోడల్ అధికారులు బసిరెడ్డి, ధనుంజయ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, జెడ్ పి సి ఓ ప్రభాకర్ రెడ్డి మరియు చిత్తూరు, పలమనేరు మున్సిపల్ కమిషనర్లు విశ్వనాథ్, కిరణ్ కుమార్ లు, కురబలకోట, తిరుపతి అర్బన్, తహశీల్దార్లు, చిన్నగొట్టిగల్లు, నగరి, వి.కోట ఎంపిడిఓ లు, ఇతర సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ – 19 దృష్ట్యా మొదటి మరియు రెండవ దశ వ్యాప్తి నియంత్రణకు జిల్లా యంత్రాంగం చేసే కార్యక్రమాల్లో భాగస్వాములైన డాక్టర్లు, అధికారులు, వైద్య మరియు ఇతర సిబ్బంది సేవలు అభినందనీయమని తెలిపారు. మొదటి, రెండవ దశలో వైరస్ వ్యాప్తిని సమన్వయంతో ఎదుర్కొంటున్నామని, రానున్న మూడవ దశ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని, మూడవ దశలో ఎక్కువగా చిన్న పిల్లలు, 18 సం.ల లోపు వయసు గల వారి పై ప్రభావం చూపుతుందని, కావున వీరికి అవసరమైన వైద్య సేవలు అందించేందుకు ప్రస్తుతం ఉన్న వైద్య సదుపాయాలు, ఆక్సిజన్ సరఫరా, అందుబాటులో ఉన్న ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, మౌలిక వసతులతో పాటు, మూడవ దశ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు తీసుకోవలసిన జాగ్రత్తల పై సమిష్టిగా అందరూ చర్చించుకుని అందుకు అనుగుణంగా అవసరమైన ఏర్పాట్ల నిమిత్తం ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ప్రధానంగా కోవిడ్ మూడవ దశ వ్యాప్తి దృష్ట్యా 0-5 వయసు గల పిల్లల తల్లులకు ఈ నెల 10 నుండి జరిగే వ్యాక్సినేషన్ ప్రక్రియను సమన్వయంతో విజయవంతం చేయాలని, ఈ విషయంలో వ్యాక్సినేషన్ అధికారులతో పాటు ప్రధానంగా ప్రతి మండలంలో ఎంపిక చేసిన వ్యాక్సినేషన్ సెంటర్ కు తల్లులు వెళ్ళి వ్యాక్సిన్ చేయించుకునేలా క్షేత్ర స్థాయిలోని అధికారులు అందరూ చర్యలు చేపట్టాలని డిఎం అండ్ హెచ్ఓ ను ఆదేశించారు. చిన్నపిల్లల పట్ల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తూ కోవిడ్ ప్రోటోకాల్ పిల్లలు కూడా పాటించేలా వారికి తెలియజేయాలన్నారు. మూడవ దశ వ్యాప్తి నియంత్రణలో భాగంగా జిల్లాలో గల రుయా, స్విమ్స్, తిరుపతి మెటర్నిటీ, జిల్లా ప్రధాన ఆసుపత్రులు చిత్తూరు, మదనపల్లెలో గల పీడియాట్రీషియన్ వార్డ్ లో గల పడకల సామర్థ్యం, ఆక్సిజన్ సరఫరా, ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, ఇంకా ఏర్పాటు చేయవలసిన సదుపాయాల పై చర్చించారు.

తిరుపతి రుయా ఆసుపత్రిలో గల పీడియాట్రీషియన్ వార్డ్ నందు 160 పడకలు కలవని, ఇందులో 132 ఆక్సిజన్ బెడ్లు, 28 నాన్ ఆక్సిజన్ బెడ్లు కలవని, పడకల సామర్థ్యాన్ని పెంచాలని, ట్రయేజింగ్ నిర్వహణను సమర్థవంతంగా చేయాలని, ఇతర వైద్య సిబ్బందిని నియామకం మరియు పీడియాట్రిక్ వర్డ్ లో పని చేసే వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వవలసిన అవసరం కలదని ఎస్ వి ఆర్ ఆర్ పీడియాట్రీషియన్ వార్డ్ ప్రొ. డా. కిరీటి, ప్రొ. డా. తిరుపతి రెడ్డిలు కలెక్టర్ కు వివరించారు.
స్విమ్స్ ఆసుపత్రి నందు పీడియాట్రీషియన్ వార్డ్ లో 20 పడకలు కలవని, కోవిడ్ మొదటి దశ వ్యాప్తి నుండి ఇప్పటి వరకు 18 సం. ల లోపు గల వయసు గల వారికి 39 మందికి వైద్య సేవలు అందించడం జరిగిందని, ఈ వార్డు నందు పీడియాట్రీషియన్ లను, సిబ్బందిని నియామకం చేసుకోవలసిన అవసరం ఉందని స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ కలెక్టర్ కు వివరించారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:The services of everyone involved in Kovid first and second phase outbreak control are appreciated

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *