మున్సిపల్‌ కార్మికుల సేవలు మరువలేనిది

– కొండవీటి నాగభూషణం

Date:13/11/2020

పుంగనూరు ముచ్చట్లు:

ఆహర్నిశలు ప్రజల కోసం పనిచేస్తున్న మున్సిపల్‌ కార్మికుల సేవలు మరువలేనిదని మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం అన్నారు. శుక్రవారం మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో మున్సిపాలిటిలో వాహనాలకు పూజలు చేశారు. ఈ సందర్భంగా నాగభూషణం మాట్లాడుతూ మున్సిపాలిటి పరిధిలోని కార్మికులు, కరోనాను నియంత్రించేందుకు చేసిన సేవలతో కరోనాను నియంత్రించగలిగామన్నారు. పట్టణ ప్రజలు మున్సిపాలిటికి అన్ని విధాల సహకారం అందించి , పట్టణాభివృద్ధికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సఫ్ధర్‌, సురేంద్రబాబు, కౌన్సిలర్‌ అభ్యర్థులు అమ్ము, కిజర్‌ఖాన్‌, నటరాజ, శ్రీనివాసులు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

ఆనాధ శవానికి అంత్యక్రియలు

Tags: The services of municipal workers are unforgettable

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *