The services of scientist Dr. Yalla Pragda Subbarao are memorable

శాస్త్రవేత్త డాక్టర్ యల్లా ప్రగడ సుబ్బారావు సేవలు చిరస్మరణీయం

-సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి

Date:10/08/2020

డోన్  ముచ్చట్లు:

అగష్టు 9 న ప్రముఖ వైద్యుడు, శాస్త్రవేత్త    యల్లా ప్రగడ సుబ్బారావు   వర్థంతి సందర్బంగాడోన్ పట్టణం లో సామాజిక కార్యకర్త పి.మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో శాస్త్రవేత్త   యల్లాప్రగడ సుబ్బారావు   వర్ధంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘణంగా నివాళి అర్పించారు. వారిని స్మరించుకున్నారు.ఈ సందర్బంగా సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి మాట్లాడుతూమన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి పేర్కొన్నారు. యల్లాప్రగడ సుబ్బారావు  జనవరి 12, 1895 జన్మించారు. మన భారత దేశానికి చెందిన వైద్య శాస్త్రజ్ఞులలో చాలా ప్రసిద్ధి చెందిన మహానుభావులు. క్షయ, బోదకాలు, టైఫాయిడ్, పాండురోగం మున్నగు వ్యాధులను పూర్తిగా నిర్మూలింపగల మందులను కనుగొన్నాడు. యల్లాప్రగడ సుబ్బారావు హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ నుండి డిప్లొమా పొందిన తర్వాత, ఈయన లెడర్లీ ప్రయోగశాలలో చేరాడు.  1945లో ప్రపంచములోనే మొట్టమొదటి టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ ను  కనుగొన్నారు.

 

 

కొత్తగా కనుగొనిన ఒక శిలీంద్రము (ఫంగస్) నకు ఈయన గౌరవార్ధము సుబ్బారోమైసిస్ స్ప్లెండెన్స్ (Subbaromyces splendens) అని నామకరణము చేశారు. 1947లో అమెరికా పౌరసత్వమునకు అర్హత పొందినా సుబ్బారావు తన జీవితాంతము భారతీయ పౌరునిగానే మిగిలిపోయాడు. తన జీవితమును మొత్తము వైద్య శాస్త్ర పరిశోధనకు అంకితం చేశాడు. ప్రజల ఆరోగ్యాల పై నిరంతరం సేవలందించిన మహనీయులు డాక్టర్ యల్లాప్రగడ గారు 1948 ఆగష్టు 9వ తేదిన కన్నుమూశారు.లెడర్లీ సంస్థ వారు ఈయన పట్ల గౌరవసూచకంగా  బొంబాయిలోని బల్సార్‌లో నిర్మించిన తమ ప్రయోగశాలకు డా. యల్లాప్రగడ సుబ్బారావు సంస్థ అని నామకరణం చేశారు.ఇలాంటి మహానుభావులను స్మరించుకుంటు వారి అడుగుజాడలల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి కోరారు.

ఆగ‌స్టు 21న శ్రీ వరాహస్వామి జయంతి

Tags:The services of scientist Dr. Yalla Pragda Subbarao are memorable

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *