పుంగనూరులో టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్‌ కృష్ణారావు సేవలు మరువలేనిది

పుంగనూరు ముచ్చట్లు:

 

మున్సిపాలిటిలోని టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్న కృష్ణారావుకు అసిస్టెంట్‌ సిటి ప్లానింగ్‌ ఆఫీసర్‌గా పదోన్నతి కల్పిస్తూ బదిలీ చేశారు. శనివారం ఈ మేరకు కమిషనర్‌ కెఎల్‌.వర్మ, చైర్మన్‌ అలీమ్‌బాషా కలసి ఆయనను ఘనంగా సన్మానించి, ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ కృష్ణారావుకు పదోన్నతి కల్పిస్తూ విశాఖపట్నం అసిస్టెంట్‌ టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్‌గా బదిలీ చేసినట్లు తెలిపారు. సుమారు ఆరు సంవత్సరాలుగా కృష్ణారావు టౌన్‌ప్లానింగ్‌ విభాగాన్ని క్రమబద్దీకరించి, ప్రభుత్వానికి ఆదాయాన్ని చేకూర్చుతూ మున్సిపాలిటి అభివృద్ధికి దోహదం చేశారని చైర్మన్‌ ప్రశంసించారు. మున్సిపాలిటిలోని అన్నిశాఖల అధికారులు, సిబ్బంది ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ నాగభూషణం, కౌన్సిలర్లు అమ్ము, నటరాజ, రేష్మా , తుంగామంజునాథ్‌, పార్టీ నాయకులు రాజేష్‌, కుమార్‌, సురేష్‌ పాల్గొన్నారు.

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags: The services of Town Planning Officer Krishna Rao in Punganur are unforgettable

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *