కరోనా నియంత్రణలో కార్మికుల సేవలు మరువలేం

– ఎంపీ రెడ్డెప్ప

Date:30/06/220

పుంగనూరు ముచ్చట్లు:

The services of workers under the control of Corona cannot be forgotten

పట్టణంలో కరోనా నియంత్రణలో మున్సిపల్‌ కార్మికుల సేవలు ప్రశంసనీయమని చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప అన్నారు. మంగళవారం మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో కార్మికుడు మునస్వామి దంపతుల పదవి విరమణ సందర్భంగా వారికి శాలువకప్పి , పూలమాలలతో సన్మానించారు. ఎంపీ మాట్లాడుతూ ప్రాణాలను పణంగా పెట్టి , పట్టణ ప్రజల శ్రేయస్సు కోసం మున్సిపల్‌ కార్మికులు ఆహర్నిశలు పని చేస్తున్నారన్నారు. వారి సేవలను మరువలేమన్నారు. కమిషనర్‌ మాట్లాడుతూ ప్రభుత్వపరంగా కార్మికుడికి అందాల్సిన ఆర్థిక సహాయం త్వరలోనే అందిస్తామన్నారు. అలాగే భగవాన్‌ వెల్ఫేర్‌ సోసైటి అధ్యక్షురాలు ఈశ్వరమ్మ ఆధ్వర్యంలో పేదలకు నిత్యవసర వస్తువులను అందజేశారు. ఎంపీ వీటిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అకౌంట్స్ ఆఫీసర్‌ మనోహర్‌, మేనేజర్‌ రసూల్‌ఖాన్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సఫ్ధర్‌ , సోసైటి సభ్యులు దామోదర్‌రెడ్డి, సదాశివరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

డిప్యూటీ మేనేజర్ భాస్కర్ కాంట్రాక్టు ఉద్యోగి ఉషపై దాడి

Tags: The services of workers under the control of Corona cannot be forgotten

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *