గీట్ల చేసిన సేవలు అజరామం
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
పెద్దపల్లి ముచ్చట్లు:
పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ గీట్ల ముకుందరెడ్డి చేసిన సేవలు అజరామమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. స్వర్గీయ గీట్ల ముకుంద రెడ్డి విగ్రహాన్ని జిల్లా కేంద్రంలోని కూనారం రోడ్డులో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తిగా చరిత్రలో నిలిచి పోయాడన్నారు. గ్రామాల అభివృద్ధి లో చిత్తశుద్ధితో పని చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ గీట్ల ముకుందరెడ్డి రాజకీయంలో పండితులు, ప్రజల నాడి తెలిసిన వ్యక్తిగా ప్రతి ఒక్కరికి సుపరిచితులు గా నిలిచారని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, బిరుదు రాజమల్లు, చింత కుంట విజయరమణ రావు, గీట్ల కుటుంబ సభ్యులు, ఆయా పార్టీల నాయకులు కటకం మృత్యుంజయం, ఈద శంకర్ రెడ్డి, వేముల రామ్మూర్తి, గీట్ల సవితా రెడ్డి, రాజేందర్ రెడ్డి, నర్సింహా రెడ్డి, జెడ్పిటి సిలు బండారి రామ్మూర్తి, గంట రాములు తో పాటు పలువురు సీనియర్ నాయకులు తిరుపతి రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, ఈర్ల కొమరయ్య, గొట్టేముక్కుల సురేష్ రెడ్డి, నల్ల మనోహర్ రెడ్డి, యాట మల్లారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, భూషణవేన సురేష్ గౌడ్, కడార్ల శ్రీనివాస్,ఎండి మునీర్, భూతగడ్డ సంపత్, తూముల సుభాష్, బొడ్డుపల్లి శ్రీనివాస్, ఎండి సర్వర్ పాషా, వేముల వీరేశం తదితరులు పాల్గొన్నారు.

Tags: The services rendered by Geeta are immortal
