The setting up of idols of Ganesha is not allowed

వినాయకుడి విగ్రహాల ఏర్పాటుకు అనుమతిలేదు

Date:13/08/2020

చౌడేపల్లె ముచ్చట్లు:

వినాయకచవితి పండుగను పురస్కరించుకొని వీధులు, బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటుకు అనుమతిలేదంటు ఎస్‌ఐ కృష్ణమోహన్‌ తెలిపారు. గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ శంకరయ్య, తహసీల్దార్‌ మురళిలతో కలిసి విగ్రహాల ఏర్పాటు కమిటీ సభ్యులతో సమావేశం జరిగింది.ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ కోవిడ్‌-19 విజృంభిస్తున్నందున ప్రభుత్వ ఆదేశాల మేరకు పండుగను వారి ఇండ్లలోనే జరుపుకోవాలన్నారు. గతంలో లాగా బహిరంగ ప్రదేశాల్లో వినాయకుడి విగ్రహాల ఏర్పాటునిషేదించామన్నారు. అలాగే ఈనెల 15,16వతేదీలలో జరగాల్సిన రాజనాలబండ తిరుణాలను సైతం రద్దుచేశామని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంగిస్తే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదుచేయడంతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.

108లో గర్భిణీ ప్రసవం

Tags: The setting up of idols of Ganesha is not allowed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *