వేప చెట్టు కు అమ్మవారి ఆకారం
బనగానపల్లెలో వింత ఘటన
బనగానపల్లె ముచ్చట్లు:
నంద్యాల జిల్లా బనగానపల్లె , తెలుగు పేట లోని పాత బావి వద్ద ఉన్న వేప చెట్టుకు వింత ఘటన చోటుచేసుకుంది. చెట్టు మొదలు బాగం లో అమ్మవారి రూపం తో ఆకారం ఏర్పడి కనిపించడంతో , స్థానికుల్లో భయంతో పాటు భక్తి భావం కూడా ఏర్పడింది. తెలుగు పేట కాలనీవాసులు ఇంటి ఇలవేల్పు అమ్మగా భావించి పూజించే సాక్షాత్తు జమ్ములమ్మ తల్లి వేప చెట్టుపై దర్శనం ఇచ్చిందంటూ.. అమ్మవారి రూపం ఆకారం ఏర్పడిన చోట , భక్తిశ్రద్ధలతో పసుపు కుంకుమలు రాసి , ఆభరణాలు అలంకరించి , ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేపచెట్టు పై అమ్మవారి ఆకారం ఏర్పడిన వింత ఘటన సమాచారం పట్టణం లోని వివిధ కాలనీవాసులకు తెలియడంతో పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి అమ్మవారికి, నైవేద్యం పెట్టి హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కుకున్నారు.వేప చెట్టుపై అమ్మవారి ఆకారం ఏర్పడి హాట్ టాపిక్ గా మారిన ఈ వేప చెట్టు ను గత కొద్ది నెలల క్రితం చెట్టు పైభాగాన్ని రంపం యంత్రంతో కోసివేసి చెట్టును పైభాగం అంతా కోసి వేసి తొలగించడం జరిగింది. చెట్టును కోసి వేయడం వల్లే అమ్మవారు ఆగ్రహించి , వేప చెట్టుపై అమ్మవారు దర్శనమిచ్చారనే ప్రచారం జరుగుతుంది.

Tags: The shape of mother to the neem tree
