శ్రీవారి ఆలయంలో వైభవంగా ఆణివార ఆస్థానం

The Shiva Temple is a magnificent fortress in the temple

The Shiva Temple is a magnificent fortress in the temple

Date:17/07/2018
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారంనాడు సాలకట్ల ఆణివార ఆస్థానం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీశ్రీశ్రీ పెద్ద జీయంగార్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయంగార్‌స్వామి, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు  పుట్టా సుధాకర్ యాదవ్ దంపతులు, ఈవో  అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల ఇన్చార్జ్ , తిరుపతి జెఈవో  పోల భాస్కర్ దంపతులు పాల్గొన్నారు. ముందుగా ఉదయం 7.00 నుండి 9.00 గంటల వరకు బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీవిష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేశారు. అనంతరం ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు, బంగారువాకిలి వద్ద ఆస్థానంలో వేంచేపు చేసిన ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదించారు. అనంతరం శ్రీశ్రీశ్రీ పెద్ద జీయంగార్ పెద్ద వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేశారు. శ్రీశ్రీశ్రీ చిన్న జీయంగార్, ఛైర్మన్, ఈవో, తిరుపతి జెఈవో, ఇతర ఉన్నతాధికారులు వెంటవచ్చారు. నాలుగు పట్టు వస్త్రాలను మూలవిరాట్టుకు అలంకరించారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామివారికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరించారు. తదనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాదవస్త్రంతో ”పరివట్టం”(చిన్న పట్టుగుడ్డ) కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి  ‘నిత్యైశ్వర్యోభవ’ అని స్వామివారిని ఆశీర్వదించారు. ఆ తరువాత అర్చకులు శ్రీశ్రీశ్రీ పెద్ద జీయంగారికి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయంగారికి, టిటిడి తరఫున కార్యనిర్వహణాధికారి  అనిల్‌కుమార్ సింఘాల్‌కు ‘లచ్చన’ అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడిచేతికి తగిలించారు. హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాలచెంత ఉంచారు. అనంతరం ఆస్థానం ముగిసింది. వార్షిక లెక్కలు ప్రారంభించిన రోజు  :
 పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుండి టిటిడి వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టిటిడి ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి – ఏప్రిల్ నెలలకు మార్చారు. ఆర్జితసేవలు రద్దు :ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా జులై 17వ తేదీ మంగళవారం అష్టదళ పాద పద్మరాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మూత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.
 శ్రీవారి ఆలయంలో వైభవంగా ఆణివార ఆస్థానం https://www.telugumuchatlu.com/the-shiva-temple-is-a-magnificent-fortress-in-the-temple/
Tags:The Shiva Temple is a magnificent fortress in the temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *