వీఆర్ఏల షాక్
మహబూబ్ నగర్ ముచ్చట్లు:
అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు జోగులాంబ అమ్మవారి ఆశీస్సులు నిండుగా కలిగి వీఆర్ఏల డిమాండ్ ను నెరవేర్చి విధంగా వరం ప్రసాదించమని వీఆర్ఏలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆలయం ముందు అమ్మవారికి వినతి పత్రం అందించారు. 45 రోజులుగా నిరవధికగా సమ్మె నిర్వహిస్తున్నా ముఖ్యమంత్రిలో చలనం లేకపోవడం బాధాకరంగా ఉందని జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు గోవిందు ఆవేదన వ్యక్తం చేశారు. నడిగడ్డ ఇష్టదైవమైన జోగులాంబ అమ్మవారి దయతోనైనా తమ సమస్యలు తీరి త్వరలో ఉద్యోగం చేసుకునే విధంగా వరాలు కురిపించాలని కోరుకున్నారు.ప్రభుత్వం తీరును తెలియజేస్తూ జిల్లాలో ఉన్న వీఆర్ఏలమంతా కలిసి బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని, ఆ ర్యాలీ అలంపూర్ జోగులాంబ అమ్మవారి నుండి ప్రారంభమై గద్వాల కలెక్టరేట్ కు చేరుకుని ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవలేని పక్షంలో నిరవధిక సమ్మె ఉధృతం చేస్తామన్నారు. మునుగోడులో జరిగే ఎన్నికల్లో కూడా వీఆర్ఏల భారీ సభను ఏర్పాటు చేసి రాష్ట్రం పనితీరును ప్రజలకు తెలియజేస్తామన్నారు.
Tags: The shock of VRs

