Natyam ad

టెన్త్ పేపర్ లీక్ కేసులో విస్తుపోయే నిజాలు!…

విజయవాడ  ముచ్చట్లు:

టెన్త్ పేపర్ లీకేజీ  వ్యవహారంలో నారాయణ సంస్థల అధినేత టీడీపీ మాజీ మంత్రి నారాయణను పోలీసులు మంగళవారం (మే 10) అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్‌ 4న నారాయణ కాలేజి వైస్‌ ప్రిన్సిపల్‌తో సహా మరికొందరిని అరెస్టు పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరితోపాటు పేపర్‌లీక్‌ ఉదంతంలో పాలుపంచుకున్న పలువురు టీచర్లను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.నారాయణ విద్యాసంస్థల సిబ్బంది ఫోన్లలో కీలక డేటా.. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. నారాయణ విద్యాసంస్థల సిబ్బంది వినియోగించిన ఫోన్లలో కీలక డేటా బయటపడింది. కేవలం తమ విద్యాసంస్థలకు ర్యాంకులు రావాలనే దురాలోచనతో నారాయణ సిబ్బంది బరితెగింపు చర్యలకు పాల్పడింది. ప్రశ్నపత్రాలను ఫొటోలు తీసి, షేర్‌చేసి తమ విద్యార్ధులకే ఎక్కువ మార్కులు వచ్చేలా అక్రమాలకు తెరదించారు. ఎవరి ఆదేశాలమేరకు ఈ వ్యవహారాన్ని నడిపారు, ఎన్నేళ్లుగా ఇదంతా నడుస్తుందన్న దానిపై చిత్తూరు పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఇక వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకునే ఈ విధమైన విద్యాసంస్థలపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.  ఈ కేసులో ఏపీ పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు.మాజీ మంత్రి నారాయణ అరెస్టు ఇలా.. నారాయణ సంస్థల అధినేత టీడీపీ మాజీ మంత్రి నారాయణను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఏపీ సీఐడీ పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. పేపర్ లీకేజీ కేసులో ఆయన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఐతే ఏ నేరం కింద నారాయణను అరెస్ట్‌ చేశారనే విషయాన్ని పోలీసులు అధాకారికంగా ఇంకా ప్రకటించలేదు.కాగా, ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల సందర్భంగా ప్రశ్న పత్రాలు వరుసగా లీక్‌ అయ్యాయి. ఈ లీకేజీ వెనుక శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి విజయవాడ నుంచి ప్రత్యేకంగా ఏపీ సీఐడీ బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులను కూడా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

 

Tags:The shocking facts about the Tent Paper Leak case!

Post Midle
Post Midle