The shrine of Sri Govindarajaswamy is the envelope

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కవచ ప్రతిష్ఠ

Date:02/07/2020

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్టాభిషేకంలో భాగంగా రెండో రోజు గురువారం కవచప్రతిష్ఠ జరిగింది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ కార్య‌క్ర‌మాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించారు.ఈ సందర్భంగా ఉదయం శతకలశ స్నపనం, మహాశాంతి హోమం, స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి కవచప్రతిష్ఠ చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని తిరుచ్చిపై ఆలయ విమాన ప్రాకారంలో ఊరేగిస్తారు.ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద‌జీయంగార్‌, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయంగార్‌, ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో  వరలక్ష్మి, ఏఇవో   ర‌వికుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్  రాజ్‌కుమార్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్  ‌ మునింద్ర‌ పాల్గొన్నారు.

డిసెట్ లో మెరిసిన మట్టిలో మాణిక్యం

Tags: The shrine of Sri Govindarajaswamy is the envelope

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *