ఆరవ విడత పోలింగ్ కు రంగం సిద్దం

Date:11/05/2019
న్యూ ఢిల్లీ ముచ్చట్లు:
ఆదివారం నాడు దేశ వ్యాప్తంగా ఆరవ విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ కు అంతా సిద్దమయింది. . ఏడు రాష్ట్రాల్లో 59 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. యూపీలో 14, హర్యానా 10, పశ్చిమ బెంగాల్ 08, మధ్యప్రదేశ్ 08, బిహార్ 08, ఢిల్లీ 07, జార్ఖండ్ 04 లోక్సభ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఈ ఎన్నికల్లో 10 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోబోతున్నారు. మొత్తం 979 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ కోసం లక్షా 13 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.భోపాల్ లో సాధ్వీ ప్రగ్యా, దిగ్విజయ్ సింగ్ బరిలో వున్నారు. ఈశాన్య ఢిల్లీనుంచి షీలా దిక్షిత్ (కాంగ్రెస్), మనోజ్ తివారి (బీజేపీ) దిలిప్ పాండే (ఆప్) లు పోటీ లో వున్నారు.
అలాగే మధ్యప్రదేశ్ గున నియోజవర్గంలో జ్యోతిర్యాదిత్య సింధీయా పోటీ చేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ నుంచి బీఏపీ అభ్యర్ధి మనేకా గాంధీ, అజంఘడ్ లో అఖిలేష్ యాదవ్ లు బరిలో వున్నారు.  సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర సీసీ కెమెరాలు అమర్చామని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Tags: The sixth installment is ready for polling

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *