నినాదాలు..నిరసనలతో లోక్ సభ వాయిదా

Date:19/03/2018
న్యూ ఢిల్లీ ముచ్చట్లు:
విపక్షాల నిరసనల మధ్యే సభ ఎటువంటి కార్యక్రమాలు కొనసాగకుండానే వాయిదా పడింది.  సోమవారం ఉదయం స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్ సభలో ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. సభ ఆర్డర్ లో లేకుండా తాను సభను కొనసాగించలేనని చెప్పారు. సభ్యులు తమ సీట్లలో కూర్చోవాలని పదే పదే విజ్జప్తి చేశారు. అయితే విపక్షాలు నినాదాలతో హోరెత్తించడంతో సభలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. కేంద్రప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. దీంతో సభను సుమిత్రా మహాజన్ మంగళవారానికి  వాయిదా వేశారు.  అవిశ్వాసంతో హీటెక్కిన ఢిల్లీ, మారుతున్న రాజకీయ పరిణామాలు, ఇది రెండు రోజులుగా కనిపించిన హడావిడి. అయితే ఊరించి ఉసూరుమనిపించారు. అవిశ్వాస తీర్మానం మాత్రం లోక్‌సభ వరకు వస్తోంది. ఆ తర్వాతే సీన్ మారిపోయి  అది చర్చ వరకు వెళ్లడం లేదు. ఇవాళైనా చర్చకు వస్తుందేమోనని అందరూ భావించారు. మళ్లీ నో ఛేంజ్.  సేమ్ సీన్. సభవాయిదాపడింది. దీంతో మళ్లీ అవిశ్వాసం అటకెక్కింది.  ఉదయం సభ ప్రారంభంకాగానే… రిజర్వేషన్ల అంశంపై టీఆర్ఎస్… కావేరీ బోర్డు ఏర్పాటుపై అన్నా డీఎంకే ఎంపీలు నిరసనకు దిగారు. కేవలం 30సెకన్లకే సభ వాయిదా పడింది. మళ్లీ 12 గంటలకు ప్రారంభమైనా సేమ్ సీన్ కనిపించింది. అలా సభ ప్రారంభమయ్యిందో లేదో… ఇలా టీఆర్ఎస్, అన్నా డీఎంకే ఎంపీలు మళ్లీ నిరసన చేపట్టారు.  స్పీకర్ సభకు సహకరించాలని పదే పదే విజ్ఞప్తి చేసినా ఎంపీలు వినలేదు. టీఆర్ఎస్ ఎంపీలైతే నేరుగా స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లారు. ఈ గందరగోళం మధ్యే స్పీకర్ అవిశ్వాసానికి సంబంధించిన నోటీసును చదివి వినిపించారు. చర్చించేందుకు సహకరించాలని కోరారు. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. సభ ఆర్డర్‌లో లేకుండా చర్చ సాధ్యం కాదన్న మహాజన్,  కొద్దిసేపటికే సభను మంగళవారానికి వాయిదా వేశారు. అయితే టీడీపీ, వైసీపీలు మాత్రం వెనక్కు తగ్గేది లేదంటున్నాయి. మంగళవారం కూడా మళ్లీ అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇస్తామంటున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు తాము సిద్ధమేనంటూ హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ చెప్పారు. అయినా టీఆర్ఎస్, మరికొన్ని పార్టీలు ఆందోళన విరమించకపోవడంతో సభ వాయిదా పడింది.మరి నోటీసులు చర్చకు వస్తాయో లేక మళ్లీ వాయిదాల పర్వం కొనసాగుతుందో చూడాలి.
Tags:The slogan was postponed by the slogans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *