నాటు తుపాకుల కలకలం
కామారెడ్డి ముచ్చట్లు:
నిజాంసాగర్ మండలం లో నాటు తుపాకులు కలకలం రేపాయి.మండలం లోని సింగీతం గ్రామం లో గంజాయి సాగు చేస్తున్నారనే సమాచారం తో ఎక్సైజ్ పోలీసుల దాడి చేయగా, ఒక గంజాయి మొక్క, రెండు నాటు తుపాకులు లభ్యమయ్యాయి. ఇద్దరి నిందితుల మీద కేసు నమోదు చేశారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం లోని సింగీతం గ్రామం పై బాన్స్ వాడ ఎక్సైజ్ పోలీసులు దాడి చేశారు.గంజాయి మొక్కలు పెంచుతున్నారనే సమాచారం మేరకు ఒక ఇంటిపై దాడి నిర్వహించగా ఒక గంజాయి మొక్క తో పాటు రెండు నాటు తుపాకులు లభ్యమయ్యాయి.నాటు తుపాకులను బాన్స్ వాడ పోలీసులకు అప్పగించారు ఎక్సైజ్ పోలీసులు.ఇద్దరు నిందితుల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags; The sound of gunfire

