Date:12/11/2019
చిత్తూరు ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా వరదయ్య పాళెం సీసీ రోడ్ల భూమిపూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు ఘన స్వాగతం లభించింది. ఇందిరానగర్ పంచాయతీ గౌసియా నగర్ లో సీసీ రోడ్ల భూమిపూజకు అయన మంగళవారం వచ్చారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ సర్పంచ్ రసూల్ సాహెబ్, ఎక్స్ వైస్ సర్పంచ్ నీరజా వీరభద్రం ఇతరులు పాల్గోన్నారు. వరదయ్య పాళెం మండలంలోని ఇందిరానగర్, మరదవాడ, అంబూరు, సంతవేలూర్, సీఎల్ఎన్ పల్లిపంచాయతీలలోని గ్రామాలలో సీసీ రోడ్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఆదిమూలం మాట్లాడుతూ రోడ్ల నిర్మాణానికి అవసరమైన అన్నిపనులను త్వరితగతిన చెప్పట్టాలని అధికారులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వరదయ్యపాలెం వైకాపా మండల అధ్యక్షులు నాయుడు దయాకర్ రెడ్డి,వైసీపీ నాయకుడు విద్యాసాగర్ అలియాస్ సునీల్,ఎన్నమ్మ విజయ్,ఎన్నెమ్మ ప్రసాద్,వరదయ్యపాలెం మాజీ సర్పంచ్ లు చిన్న ,తిలక్ మోహన్,. మరదవాడ శివ యాదవ్,ఎస్సీ సెల్ నెంబర్ చంద్ర, అబ్దుల్ ఈషాక్, ఉజ్వల్ రెడ్డి, దామోదర్ రెడ్డి అబూబకర్,ఎమ్ పల్ల చలపతి,ఎమ్ పల్ల గోవర్ధన్,శ్రీధర్ తదితరుల నాయకులు పాల్గొన్నారు.
అల్లరి నరేశ్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో మూవీ
Tags:The source of the MLA who laid the foundation for the roads