Natyam ad

మహిళపై జరిగిన దాడి పై ఎస్పీ   వెంటనే స్పందించాలి.

– సీఐ అంజూ యాదవ్ ను సస్పెండ్ చేయాలి.

– ఏపీ మహిళా సమాఖ్య (NFIW)

 

తిరుపతి  ముచ్చట్లు:

Post Midle

సామాన్య మహిళా పట్ల దురుసుగా ప్రవర్తించిన శ్రీకాళహస్తి సిఐ అంజు యాదవ్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 10 గంటలకు సీఐ కొట్టడంతో తీవ్రంగా గాయపడిన మహిళను రుయా హాస్పిటల్ లో పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలో సిఐ అంజు యాదవ్  దారుణమైన దురాగతం పెద్ద ఆపరేషన్ చేసుకున్న ఒక మహిళను తన భర్త ను గురించిన సమాచారం కొరకు ఆ మహిళను దారుణంగా కొట్టి బూట్ తో తన్ని బలవంతం గా పోలీస్ వాహనం లో కుక్కి మరీ  స్టేషన్ కు తీసుకెళ్ళి దారుణంగా కొట్టి హింసించిన సి ఐ అంజు యాదవ్ ను సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారందరిపై తిరుపతి జిల్లా ఎస్పీ  ఉక్కు పాదం మోపినట్లుగా అధికారం ఉందన్న అహంతో ప్రజల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్న ఇటువంటి పోలీస్ అధికారులపై కూడా చర్యలు తీసుకోవలసిన బాధ్యత తిరుపతి జిల్లా ఎస్పీ పై ఉందని అన్నారు.

 

ఒక మహిళ పోలీస్ అధికార అయ్యుండి మరొక మహిళపై మృగం కంటే హీనంగా వ్యవహరించడంపై రాష్ట్రం మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఏ ఒక్క అధికారి కూడా స్పందించకపోవడంపై సభ్య సమాజం బాధపడుతుందన్నారు. యూనిఫాం ఉందన్న అహంకారంతో ఉన్న ఇటువంటి అధికారులకు రానున్న రోజుల్లో ఈ అధికారి పై చర్యలు తీసుకొని ఎడల తిరుపతి జిల్లా మొత్తం ఉద్యమానికి రూపకల్పన చేస్తామని హెచ్చరించారు.నిబంధనలకు విరుద్దంగా డాబాలుఉక్కుపాదం మోపితే అబాండాలు వేస్తున్నారని చెబుతున్న ఈ అధికారులకు కొంచమైన సిగ్గుందాని ప్రశ్నించారు. కోవిడ్ కారణంగా గత రెండు సంవత్సరాలుగా వ్యాపారలు నష్టపోయిన వారికి ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇచ్చి వ్యాపార అనుమతులు ఇచ్చిన దాన్ని ఈ అధికార యంత్రాంగానికి తెలియదా అని ప్రశ్నించారు. ట్రాఫిక్ కు ఇబ్బంది కల్పిస్తూ వున్నారని చిన్న చిన్న చిరు వ్యాపారస్తులను సైతం ఇబ్బంది పాలు చేస్తున్న ఇలాంటి అధికారులపై ప్రభుత్వం స్పందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు రత్నమ్మ, విజయ, హరిత ,అలివేలమ్మ, అఖిల తదితరులు పాల్గొన్నారు.

 

Tags: The SP should immediately respond to the attack on the woman.

Post Midle