అవాస్‌యోజన ఇల్లు ప్రారంభం

The start of a new home

The start of a new home

Date:20/11/2019

పుంగనూరు ముచ్చట్లు:

అవాస్‌ దివాస్‌ దినోత్సవ సందర్భంగా మున్సిపాలిటి పరిధిలో పిఎంఏవై గృహాన్ని ప్రారంభించారు. కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో హౌసింగ్‌ డీఈ నరసింహాచారి చే నిర్మించిన ఇంటిని మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొండవీటి నాగభూషణం కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా షరీఫ్‌ మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో అర్హులైన లబ్దిదారులందరికి పక్కాగృహాలను అందించడం జరుగుతుందన్నారు. నవరత్నాలతో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు వైఎస్సార్పీకి అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ అమ్ము, ఏఈలు , వర్క్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

గ్రంధాలయ ముగింపు వారోత్సవాలు

Tags: The start of a new home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *