Natyam ad

క్రికెట్ క్రీడా సంరంభం.. అట్టహాసంగా ఆరంభం..!

– ఒకే వేదికపై 1000 జట్లు.. 15000 మంది క్రీడాకారులు

– దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే చోట 16 గ్రౌండ్లు ఏర్పాటు

– చెవిరెడ్డి కుటుంబం వెంటే చంద్రగిరి యువత : వైవీ సుబ్బారెడ్డి

Post Midle

– చంద్రగిరి ఐపీఎల్ టోర్నీకి యువత నుంచి విశేష స్పందన

 

తిరుపతి ముచ్చట్లు:


‘‘క్రికెట్.. అత్యధిక శాతం మంది యువత కోరుకునే ఆట.. సరదాగా.. ఉత్కంఠగా.. మ్యాచ్ లను ఆస్వాదించే అభిమానుల సంఖ్య పెద్దగానే ఉంటుంది. అటువంటి ఆటను గ్రామీణ యువతకు పరిచయం చేయడమే కాకుండా వారిలోని క్రీడా నైపుణ్యతను వెలికి తీయడానికి చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రతి ఏటా టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా నిలిచిన క్రికెట్ టోర్నమెంట్ ను చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పున:ప్రారంభం చేశారు. చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి క్రికెట్ పై పట్టున్న క్రీడాకారులను వెలికితీయడానికి శ్రీకారం చుట్టారు. తుమ్మలగుంట వేదికగా ఒకే చోట 16 గ్రౌండ్లను ఏర్పుటు చేసి ఒక్కో గ్రౌండ్ నుంచి నాలుగు మ్యాచ్ లు అడుకునేలా ఏర్పాట్లు చేశారు. ఆరు మండలాల్లో 108 గ్రామ సచివాలయాలు ఉండగా అందులో నుంచి వెయ్యి జట్లు క్రికెట్ పోటీల్లో పాల్గొనేందుకు దరఖాస్తులు చేయడంతో అందుకు తగ్గ రీతిలో సమయం కేటాయించారు. ఒక వేదికపై నుంచి 15000 మంది క్రికెట్ క్రీడాకారులు పోటీలో తలబడనుండగా ఆటను తిలకించడానికి వేలాది మంది క్రికెట్ అభిమానులు తరలి వస్తున్నారు. ’’

 

 

 

తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట వేదికగా వైఎస్ఆర్ గ్రామీణ క్రికెట్ టోర్నమెంట్ (చంద్రగిరి ఐపీఎల్)ను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేతులు మీదుగా ప్రారంభం చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే టోర్నమెంట్ విజయవంతం కావాలని అతిథులు అందరూ అభిప్రాయపడ్డారు. ముందుగా క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలకు బహుకరించనున్న ట్రోఫీలు, మెడల్స్ గ్యాలరీని ప్రారంభించారు. అనంతరం క్రీడా మైదానంలోకి చేరుకుని క్రీడాకారులను పరిచయం చేసుకున్న తర్వాత కొంత సమయం జిల్లా కలెక్టర్, టీటీడీ ఛైర్మన్ లు మ్యాచ్ ను అడుతూ ఆటలను ఆరంభించారు.

 

 

 

యువత అంతా.. చెవిరెడ్డి కుటుంబం వెంటే..

చంద్రగిరి యువత మొత్తం చెవిరెడ్డి కుటుంబం వెంటే నడుస్తోందని చెప్పడానికి వెయ్యి జట్లు,15000మంది క్రీడా కారులతో జరుగుతున్న టోర్నమెంట్ నిదర్శనమని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన చంద్రగిరి నియోజక వర్గ ప్రజలను తన కుటుంబ సభ్యులుగా భావించే చెవిరెడ్డి కుటుంబం పట్ల ప్రజలు విధేయతను చూపుతున్నారన్నారు. క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిలుపునిచ్చిన పది రోజుల్లో వెయ్యి జట్లు పోటీకి సిద్ధం కావడం చూస్తుంటే ప్రజల్లో ఆ కుటుంబానికి ఉన్న ఆదరణ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చన్నారు. అసాధ్యాలను సుసాధ్యం చేయగల సత్తా ఒక్క చెవిరెడ్డికి మాత్రమే ఉందని, అందుకే ఆయన ఎంత పెద్ద కార్యక్రమాన్ని అయినా అలవోకగా విజయవంతం చేయగలరన్నారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ పండుగలు, పర్వదినాలు, కష్టాలు, విపత్తులు ఇలా సందర్భం ఏదైనా సరే నేనున్నాను అన్న భరోసా కల్పించే చెవిరెడ్డి వంటి నాయకుడు ఎమ్మెల్యేగా దొరకడం అదృష్టంగా భావించాలన్నారు. కరోనా సమయంలో తన ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అలాగే క్రీడాకారులకు భాసటగా నిలిచేందుకు క్రికెట్ టోర్నమెంట్ లను నిర్వహిస్తుండటం అభినందనీయమన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ బాలాజీ, తుడా వీసీ హరిక్రిష్ణ, కార్యదర్శి లక్ష్మీలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.

 

 

 

 

దేశానికి ఆలయాలు కాదు.. క్రీడామైదానాలు కావాలి..

భారత దేశానికి కావలసింది క్రీడామైదానాలు కానీ.. ఆలయాలు కాదు అన్న స్వామి వివేకానంద మాటలను స్ఫూర్తిగా తీసుకుని గ్రామీణ ప్రాంత యువతను క్రీడల్లోకి తీసుకు రావడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నానని చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వెల్లడించారు. నలభై ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత ఆసుపత్రికి వెళ్లకూడదు అనుకుంటే 20 ఏళ్ల నుంచే గ్రౌండ్ కు వెళ్లడం అలవరచుకోవాలన్నారు. వైఎస్ఆర్ గ్రామీణ క్రికెట్ టోర్నమెంట్ ద్వారా యువకుల మద్యన స్నేహం, గ్రామాల మద్య సత్సంబంధాలను పెరుగుతాయన్నారు. టోర్నమెంట్ లో గెలుపు, ఓటమిలను క్రీడా స్ఫూర్తితో తీసుకుని స్నేహపూర్వక వాతావరణంలో మ్యాచ్ లను ఆడాలని క్రీడాకారులకు ఆయన సూచించారు.

 

 

 

ప్రజలకు అండగా నిలవడమే బలహీనత

కష్టాలు వచ్చినా.. సంతోషం వచ్చినా.. అపద వచ్చినా.. ఆర్థిక సమస్యలు వచ్చినా.. కులం చూడం.. మతం చూడం.. పార్టీలు చూడం.. అందరికీ అండగా నిలవడమే నాకున్న బలహీనత.. నా కుటుంబంతో సమానంగా ప్రజలను చూసుకోవడం మొదటి నుంచి నాకున్న అలవాటు.. అంటూ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. క్రీడల్లో గ్రామీణ యువతను ప్రోత్సహిస్తూ క్రీడా నైపుణ్యత వెలికి తీయడానికి ప్రతి ఏటా వైఎస్ఆర్ గ్రామీణ క్రికెట్ టోర్నమెంట్ లను నిర్వహిస్తున్నామన్నారు. టోర్నమెంట్ లో పాల్గొనే ప్రతి జట్టుకు రూ.20వేలు విలువైన క్రికెట్ కిట్ ను ఇవ్వడంతో పాటు ప్రతి క్రీడాకారునికి బ్రాండెడ్ టీ షర్ట్, పార్టిసిపేట్ సర్టిఫికేట్, మెడల్స్ ఇస్తున్నట్టు తెలిపారు. జట్లు మద్యన విభేదాలు రాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంతో నిష్ణాతులైన 80 మంది అంపైర్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. టోర్నీలో విజేతగా నిలిచిన వారికి రూ.25లక్షల మేరకు నగదు బహుమతులు ఇస్తున్నామని చెప్పారు. క్రీడాకారులకు ఇబ్బంది తలెత్తకుండా ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నిరంతరం అల్పాహారం, భోజనం, తాగునీరు వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్టు వివరించారు. చివరగా అతిథులచే క్రీడా జ్యోతిని వెలిగించి టోర్నమెంట్ ను లాంఛనంగా ప్రారంభించారు.

 

 

 

తొలిరోజు పోటీల్లో తలపడిన నాలుగు జట్లు

క్రికెట్ టోర్నమెంట్ తొలిరోజు పోటీల్లో నాలుగు జట్లు తలపడగా రెండు జట్లు విజేతగా నిలిచాయి. మొదటగా పాకాల మండలం దామలచెరువు, బందార్లపల్లి జట్లు పోటీలో నిలవగా దామలచెరువు జట్టు బ్యాటింగ్ ఎంచుకుని పది ఓవర్లలో 39 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ తీసుకున్న బందార్లపల్లి జట్టు వికెట్ నష్టపోకుండా 40 పరుగులతో అజేయంగా నిలిచింది. అలాగే మంగళం జట్టు మరియు సప్తగిరికాలనీ జట్టు బరిలోకి దిగాయి. ఆ రెండు జట్లు మద్య జరిగిన ఉత్కంఠ భరిత పోరులో సప్తగిరికాలనీ పంచాయతీ జట్టు ఒక వికెట్ కోల్పోయి 22 పరుగులుతో విజేతగా నిలిచింది.

 

Tags:The start of cricket.

Post Midle